Mahalaxmi Rajayogam | త్వరలో సూర్య, గురువుల కలయిక.. మహాలక్ష్మీ రాజయోగంతో ఈ మూడు రాశులకు శుభయోగం..!
Mahalaxmi Rajayogam | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై నెలలో అరుదైన గ్రహ సంయోగం ఏర్పడబోతున్నది. సూర్యుడు, గురుడు ఒకే రాశిలో కలవడం అత్యంత శుభప్రదమైన రాజయోగాలు ఏర్పడనున్నాయని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ఈ నెల 16న సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు.
Mahalaxmi Rajayogam | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై నెలలో అరుదైన గ్రహ సంయోగం ఏర్పడబోతున్నది. సూర్యుడు, గురుడు ఒకే రాశిలో కలవడం అత్యంత శుభప్రదమైన రాజయోగాలు ఏర్పడనున్నాయని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ఈ నెల 16న సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. గురుడు ఇప్పటికే అదే రాశిలో సంచరిస్తున్నాడు. దీంతో కర్కాటక రాశిలో సూర్య–గురు సంయోగం ఏర్పడి నవపంచమ యోగంతో పాటు మహాలక్ష్మీ రాజయోగం కూడా ఏర్పడనుంది. ఈ ప్రత్యేక యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు నెలకొనడంతో పాటు ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం వంటి పలు రంగాల్లో శుభ ఫలితాలు కనిపించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ రాజయోగాలతో ఎంతో శుభపద్రంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
మేష రాశి
మేష రాశి వారికి సూర్య–గురు సంయోగం సానుకూల ఫలితాలుంటాయి. జీవితంలో సౌకర్యాలు, విలాసవంతమైన అంశాలు పెరిగే అవకాశాలున్నాయి. చేపట్టిన పనుల్లో విజయాలు సాధించే అవకాశం ఉండగా.. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో పురోగతి కనిపించడంతో పాటు పదోన్నతి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాలా కాలంగా రావాల్సిన బకాయిలు లేదా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి.
మిథున రాశి
మహాలక్ష్మీ రాజయోగం ప్రభావంతో మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగయ్యే అవకాశం ఉన్నది. ఆదాయ మార్గాలు విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. పూర్వీకుల ఆస్తుల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉండగా.. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ కాలం అనుకూలంగా ఉండనుంది. పెద్ద వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో గణనీయమైన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకురానుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరగడంతో పాటు కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూల సమయం. సరైన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. భూమి, వాహనం కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరే సూచనలు ఉన్నాయి. అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్న వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Horoscope | జూలై 10 రాశి ఫలాలు.. ఈ రాశివారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం!
జులై 10, 2026

BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?
జులై 9, 2026

Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
జులై 9, 2026
తాజావార్తలు
- ●Rythu Bharosa | నేడు తుది విడత రైతుభరోసా.. 9 నుంచి 50 ఎకరాల వరకు..
- ●Horoscope | జూలై 10 రాశి ఫలాలు.. ఈ రాశివారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం!
- ●Fact Check Elephant Saving Tiger | వరదల్లో పులిని కాపాడిన ఏనుగు : మూగ జీవాలకూ భావోద్వేగాలు.. కానీ అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!
- ●BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?
- ●Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
- ●The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు

Rythu Bharosa | నేడు తుది విడత రైతుభరోసా.. 9 నుంచి 50 ఎకరాల వరకు..

Horoscope | జూలై 10 రాశి ఫలాలు.. ఈ రాశివారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం!

Fact Check Elephant Saving Tiger | వరదల్లో పులిని కాపాడిన ఏనుగు : మూగ జీవాలకూ భావోద్వేగాలు.. కానీ అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!

BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?



