త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGPSC | టౌన్‌ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ పోస్టులు.. టీజీపీఎస్సీ నోటిఫికేష‌న్‌

TGPSC | తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్ (TGPSC) నిరుద్యోగులకు గుడ్​న్యూస్​ చెప్పింది. రాష్ట్ర టౌన్‌ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలగా ఉన్న అసిస్టెంట్‌ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ (Assistant Director of Town Planning) పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

G

Telangana | Published On Jul 10, 2026, 8.21 am IST

TGPSC | టౌన్‌ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ పోస్టులు.. టీజీపీఎస్సీ నోటిఫికేష‌న్‌
Advertisement

TGPSC | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్ (TGPSC) నిరుద్యోగులకు గుడ్​న్యూస్​ చెప్పింది. రాష్ట్ర టౌన్‌ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలగా ఉన్న అసిస్టెంట్‌ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ (Assistant Director of Town Planning) పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. శుక్ర‌వారం (జూలై 10) నుంచి ద‌రఖాస్తులు ప్రారంభమ‌య్యాయి. అర్హులైన‌ అభ్యర్థులు ఆగ‌స్టు 17 వ‌ర‌కు https://www.tgpsc.gov.in/లో అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నుంది. ఉద్యోగం సాధించిన వారికి ప్ర‌తి నెల రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు జీతం అందుకోవ‌చ్చు.

మొత్తం ఖాళీలు: 10

అర్హతలు: 2026 జూలై 6 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఆర్క్ లేదా బీఈ లేదా బీటెక్ (సివిల్‌) లేదా బీ.ప్లానింగ్‌, బీటెక్‌ (ప్లానింగ్‌) లేదా ఎంఏ లేదా ఎంఎస్సీ(జాగ్రఫీ), ఎంఎస్సీ (జియోఇన్ఫర్మేటిక్స్‌), పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి. ఓపెన్ యూనివర్సిటీ, దూరవిద్య ద్వారా పొందిన డిగ్రీలు తప్పనిసరిగా యూజీసీ, ఏఐసీటీఈ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ద్వారా గుర్తింపు పొంది ఉండాలి. అభ్య‌ర్థులు 2026 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల‌ మధ్య వయస్కులై ఉండాలి. అంటే 1982, జూలై 7 నుంచి 2008 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. పరీక్షను ఓఎంఆర్‌ ఆధారిత ఆఫ్‌లైన్ విధానంలో లేదా కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో నిర్వహిస్తారు.

ఈ పరీక్ష పేపర్‌-I, పేపర్-II రెండు విభాగాలుగా ఉంటుంది. పేపర్​ 1ను 150 ప్రశ్నలు, 150 మార్కుల‌కు ఉంటుంది. 150 నిమిషాల్లో ప‌రీక్ష పూర్తిచేయాలి. జనరల్​ స్టడీస్​, జనరల్​ అబిలిటీస్​ నుంచి ప్రశ్నలు వస్తాయి.

పేపర్​ 2ను 150 ప్రశ్నలకు నిర్వహిస్తారు. ప్రతీ ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 300 మార్కులు. వ్యవధి 150 నిమిషాలు. ఇందులో సబ్జెక్ట్​ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500
పరీక్ష‌ ఫీజు: రూ.120.
దరఖాస్తులు ప్రారంభం: జూలై 10
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 17
పరీక్ష నిర్వహణ: అక్టోబర్‌లో
వెబ్‌సైట్‌: https://www.tgpsc.gov.in/

మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Advertisement
Advertisement