త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil Nadu Polls | ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన టీవీకే.. రెండుస్థానాల్లో పోటీ చేయ‌నున్న విజ‌య్‌..!

TVK Vijay | ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు విజ‌య్ త్వ‌ర‌లో త‌మిళ‌నాడులో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నాడు. త‌న పార్టీ త‌మిళ‌గ వెట్రి క‌జ‌గం త‌ర‌ఫున పెరంబూర్‌, తురుచ్చి ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. తొలిసారిగా పోటీ చేస్తున్న టీవీకే పార్టీకి అవ‌కాశం ఇవ్వాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు.

P

National | Published On Mar 29, 2026, 3.17 pm IST

Tamil Nadu Polls | ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన టీవీకే.. రెండుస్థానాల్లో పోటీ చేయ‌నున్న విజ‌య్‌..!
Advertisement

Tamil Nadu Polls | ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు విజ‌య్ త్వ‌ర‌లో త‌మిళ‌నాడులో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నాడు. త‌న పార్టీ త‌మిళ‌గ వెట్రి క‌జ‌గం త‌ర‌ఫున పెరంబూర్‌, తురుచ్చి ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. తొలిసారిగా పోటీ చేస్తున్న టీవీకే పార్టీకి అవ‌కాశం ఇవ్వాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. పార్టీ గుర్తు విజిల్ గుర్తుకు ఓటు వేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇది విజిల్ విప్ల‌వ ఎన్నిక అంటూ వ్యాఖ్యానించారు. త‌న‌కు, త‌న పార్టీ అభ్య‌ర్థుల‌కు మ‌ధ్య తేడా చూడకూడదని, అందరూ సమానమేనని స్పష్టం చేశారు.

తమిళనాడు అసెంబ్లీకి చెందిన 234 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న ఒక్క దశలోనే పోలింగ్ జరగనుంది. అధికారంలో ఉన్న డీఎంకేకు ప్ర‌తిప‌క్షాల నుంచి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోంది. అన్నాడీఎంకే, బీజేపీ కూట‌మి మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని చూస్తున్న‌ది. విజ‌య్ పార్టీ సైతం తొలిసారిగా పోటీ చేస్తున్నా.. అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని క‌సితో ఉంది. మ‌రో వైపు ఎస్ రాందాస్ నేతృత్వంలోని పీఎంకే, వీకే శ‌శిక‌ళ మిగ‌తా పార్టీల‌తో క‌లిసి కూట‌మి ఏర్పాటు చేసింది. అలాగే, నామ్ త‌మిళ‌ర్ క‌ట్చి పార్టీ ఈ సారి ఒంట‌రిగానే పోటీ చేస్తోంది.

విజ‌య్ ప్ర‌స్తుతం బ‌రిలోకి దిగుతున్న పెరంబుర్‌, తిరుచ్చి ఈస్ట్ స్థానాల్లో డీఎంకే గెలిచింది. పెరంబూర్ నుంచి ఆర్‌డీ శేఖ‌ర్‌, తిరుచ్చి ఈస్ట్‌నుంచి ఇనిగో ఎస్ ఇరుద‌య‌రాజ్ ఎమ్మెల్యేలుగా గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపొందారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ మాట్లాడుతూ ఇది కేవ‌లం అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న కాద‌ని.. ప్ర‌జ‌లను కాపాడే ప్ర‌జాప్ర‌తినిధుల ఎంపిక అన్నారు. త‌మ అభ్య‌ర్థులు సామాన్య కుటుంబాల నుంచి వ‌చ్చార‌ని, అవినీతి, అక్రమాలు, జర్నలిస్టులపై దాడులు చేసిన అనుభవం ఉన్నవారు కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఒక డీఎంకే అభ్యర్థిపై అవినీతి కేసులు ఉన్నాయని, జైలుకు వెళ్లి తిరిగి వచ్చాడని విమర్శించారు.

తమ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఎంతో జాగ్రత్త తీసుకున్నామని తెలిపారు. ఈ ఎన్నిక ప్రజల కూటమి, ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని కూట‌మి మ‌ధ్య జ‌రిగే పోటీగా అభివ‌ర్ణించారు. అధికారంలోకి వస్తే మత్తు పదార్థాలు లేని తమిళనాడును నిర్మిస్తామని, 29 ఏళ్ల తర్వాత ఉద్యోగం రాని వారికి నెలవారీ భృతి అందిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకత తీసుకువ‌చ్చేందుకు చ‌ట్టం తెస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇక టీవీకే తరఫున వీఎస్ బాబు, సీఎం ఎంకే స్టాలిన్‌పై కొలత్తూర్ నుంచి పోటీ చేయనున్నారు. చెపాక్‌లో ఉప ముఖ్యమంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌పై సెల్వం బరిలోకి దిగనున్నారు. విల్లివాక్కం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున, గోబిచెట్టిపాళయం నుంచి సెంగొట్టయ్యన్ పోటీ చేయనున్నట్లు విజ‌య్ ప్ర‌క‌టించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement