త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఫోన్ ట్యాపింగ్ కేసు.. 11 గంట‌ల‌కు సిట్ విచార‌ణ‌కు కేటీఆర్‌

KTR | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో బీఆర్ఎస్ (BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సిట్ (CIT) విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌కు రావాల్సిందిగా సిట్ నోటీసులు జారీచేసిన విష‌యం తెలిసిందే.

G

Telangana | Published On Jan 23, 2026, 8.54 am IST

KTR | ఫోన్ ట్యాపింగ్ కేసు.. 11 గంట‌ల‌కు సిట్ విచార‌ణ‌కు కేటీఆర్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో బీఆర్ఎస్ (BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సిట్ (CIT) విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌కు రావాల్సిందిగా సిట్ నోటీసులు జారీచేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌రికాసేప‌ట్లో ఆయ‌న కోకాపేట‌లోని త‌న నివాసం నుంచి బీఆర్ఎస్‌ భ‌వ‌న్‌కు రానున్నారు. పార్టీ కీల‌క‌ నేత‌లో స‌మావేశం అనంత‌రం.. సిట్ విచార‌ణ‌కు బ‌య‌ల్దేర‌నున్నారు. కేటీఆర్ వెంట హ‌రీశ్ రావు కూడా వెల్ల‌నున్నారు.

రెండు రోజుల క్రితం హ‌రీశ్ రావు (Harish Rao) కూడా సిట్ ముందు హాజ‌రైన విష‌యం తెలిసిందే. హ‌రీశ్‌ను ఆరున్న‌ర గంట‌ల‌పాటు విచారించిన వెంక‌ట‌గిరి నేతృత్వంలోని బృందమే కేటీఆర్‌ను కూడా ప్ర‌శ్నించ‌నుంది. కాగా, ప్ర‌భుత్వం ఇటీవ‌ల హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌ (Sajjanar) ను సిట్ చీఫ్‌గా నియ‌మించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం కేసు విచార‌ణ‌లో వేగం పెరిగింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్ర‌ధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్ర‌భాక‌ర్‌రావు (Prabhakar Rao) ను సుప్రీం కోర్టు తీర్పు మేర‌కు రెండు వారాల పాటు సిట్ క‌స్టోడియ‌ల్ విచార‌ణ నిర్వ‌హించింది. అనంత‌రం ఎమ్మెల్సీ న‌వీన్‌రావును సుదీర్ఘంగా ప్ర‌శ్నించింది. ఎమ్మెల్సీ న‌వీన్‌రావు తండ్రి కొండ‌ల్‌రావు, కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు త‌న‌యుడు సందీప్‌రావుల‌ను సైతం విచారించింది. అనంత‌రం సిట్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాద‌వ్‌, చిరుమ‌ర్తి లింగ‌య్య‌ల‌తో పాటు సీఎం రేవంత్‌రెడ్డి సోద‌రుడు కొండ‌ల్‌రెడ్డిల‌కు నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement