త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sabarimala | మీన మాస పూజ‌లు.. తెర‌చుకున్న అయ్య‌ప్ప ఆల‌యం

Sabarimala | కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల (Sabarimala) అయ్యప్ప స్వామి ఆలయం (Ayyappa Temple) తలుపులు తెర‌చుకున్నాయి.

G

Devotional | Published On Mar 15, 2026, 10.08 am IST

Sabarimala | మీన మాస పూజ‌లు.. తెర‌చుకున్న అయ్య‌ప్ప ఆల‌యం
Advertisement

Sabarimala | త్రినేత్ర‌.న్యూస్‌: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల (Sabarimala) అయ్యప్ప స్వామి ఆలయం (Ayyappa Temple) తలుపులు తెర‌చుకున్నాయి. మీనం నెల పూజల నేప‌థ్యంలో శ‌నివారం సాయంత్రం ఆల‌యాన్ని తెర‌చిన ప్ర‌ధాన అర్ఛ‌కుడు ఈడీ ప్ర‌సాద్.. దీపాన్ని వెలిగించారు. ఆదివారం ఉయదం 5 గంట‌ల నుంచి భ‌క్తుల ద‌ర్శ‌నానికి అనుమ‌తించారు. ఈ సందర్భంగా కలభాషికేకం, పడిపూజ వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీన మాస‌ పూజలు పూర్తయిన త‌ర్వాత‌ మార్చి 19 రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.

అనంత‌రం ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని మళ్లీ తెర‌వ‌నున్నారు. మార్చి 23న (సోమ‌వారం) జరిగే ధ్వజారోహణం (కొడియేట్టలు)తో వార్షిక ఉత్సవాలు ప్రాంభమవుతాయి. ఈనెల 31న సంప్రదాయ పల్లివెట్ట కార్యక్రమం జరుగుతుంది. ఇక వ‌చ్చే నెల‌ 1న పంబా నది వద్ద జరిగే ఆరట్టు మహోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. అదేరోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.

వార్షిక ఉత్స‌వాలు.. ప్రత్యేక పూజలు

మార్చి 23 నుంచి ఆలయంలో ప్రతిరోజూ శ్రీభూతబలి, ఉత్సవబలి వంటి ముఖ్యమైన పూజలు నిర్వహిస్తారు. భక్తులు నెయ్యాభిషేకం, అష్టాభిషేకం, పుష్పాభిషేకం, కలభాభిషేకం వంటి సేవల్లో పాల్గొనవచ్చు. సాయంత్రం దీపారాధన, అథాజపూజ తర్వాత దేవుడిని సాంప్రదాయ వాద్యాలతో శ్రీబలి ఊరేగింపుగా తీసుకెళ్తారు.

Advertisement
Advertisement