CM Revanth Reddy | కేసీఆర్.. కరెంట్ వైర్ పట్టుకో కాకిలా మాడిమసై పోతావ్ : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీకి పెటేంట్ అని, గతంలో పదేండ్ల పాటు రైతాంగానికి ఉచిత విద్యుత్ అందించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని తప్పుడు ప్రచారం చేసినా కేసీఆర్.. ప్రస్తుతం కరెంట్ వైర్ పట్టుకో కాకిలా మాడిమసై పోతావ్ అని సీఎం అన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీకి పెటేంట్ అని, గతంలో పదేండ్ల పాటు రైతాంగానికి ఉచిత విద్యుత్ అందించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని తప్పుడు ప్రచారం చేసినా కేసీఆర్.. ప్రస్తుతం కరెంట్ వైర్ పట్టుకో కాకిలా మాడిమసై పోతావ్ అని సీఎం అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని కేసీఆర్ అన్నారు. ఈనాడు వరి వేసుకుంటే 500 బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటున్నాం.. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాం. సన్నబియ్యం కోట్లాది మంది ప్రజలకు బుక్కెడు బువ్వ పెడుతుంది. ఈనాడు రైతుల కోసం వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నాం.. రైతును రాజు చేస్తున్నాం. ఆరునూరైనా.. రైతు భరోసా నిధులు ఇవ్వాలని మీరు సహకరించాలని నన్ను భట్టిని తుమ్మల అడిగారు. గతంలో 9 రోజుల్లో 9 వేల కోట్లు జమ చేశాం. ఇదే ప్రాంతంలో వర్షం కురిపించడంతో ఇటీవల సభ పెట్టుకోలేదు. శిల్పారామంలో సభ ఏర్పాటు చేసి.. రైతు భరోసా నిధులు విడుదల చేశాం. సరిగ్గా 9 రోజుల సమయంలో ఇక్కడ సభ పెట్టి చివరి విడుతగా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశాం. రైతు బీమా, రుణమాఫీ, బోనస్, గిట్టుబాటు ధర, ఉచిత కరెంట్, నష్ట పరిహారం కోసం ఇలా వ్యవసాయ రంగానికి ఒక లక్షా 70 వేల కోట్లు ఈ 30 నెలల్లో రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇది. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో నెలకు 2,500 కోట్లు ఖర్చు పెడితే.. ప్రజా ప్రభుత్వంలో నెలకు 5,525 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 25 లక్షల 35 వేల మంది రైతులకు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని సీఎం గుర్తు చేశారు.
ఉచిత కరెంట్ కోసం ప్రతి నెల 1000 కోట్లు వెచ్చిస్తున్నాం. ఆనాడు ఎన్నికల్లో విష ప్రచారం చేశారు ఉచిత కరెంట్ ఉండదని. కరెంట్ వైర్ పట్టుకో కాకిలా మాడిమసై పోతావో లేదో చూస్తా.. అది రాత్రైనా, పగలైనా పట్టుకో అని కేసీఆర్ కుటుంబానికి సవాల్ విసురుతున్నా.. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీకి పెటేంట్. ఎద్దు ఏడ్సిన వ్యవసాయం రాజు ఏడ్సిన రాజ్యం బాగుండదు అని చెప్పి రైతు కళ్లల్లో ఆనందం చూస్తున్నామని సీఎం తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్

Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!





