Ramchander Rao | సింగరేణిని కాపాడుతున్నది బీజేపీనే : రామచందర్ రావు
Ramchander Rao | తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు సింగరేణిని, కార్మికులను పట్టించుకోలేదని బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు. కానీ సింగరేణి బాగోగుల కోసం బీజేపీ ఎల్లప్పుడూ అండగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు.
Ramchander Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు సింగరేణిని, కార్మికులను పట్టించుకోలేదని బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు. కానీ సింగరేణి బాగోగుల కోసం బీజేపీ ఎల్లప్పుడూ అండగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం రామచందర్ రావు మీడియాతో మాట్లాడారు.
సింగరేణికి తాడిచర్ల రెండో బొగ్గు బ్లాక్‌ను కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, ఈ విషయంలో ప్రత్యేక చొరవచూపిన బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో సింగరేణి దాదాపు మూతపడే పరిస్థితికి చేరుకున్నప్పుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి బీఐఎఫ్ఆర్ ద్వారా రుణాలిప్పించి సంస్థను కాపాడారు అని రామచందర్ రావు గుర్తు చేశారు.
వేలంపాట లేకుండా బొగ్గు బ్లాక్ ను కేటాయించడం ద్వారా అదనంగా దాదాపు రూ.2500 కోట్ల ప్రీమియం డబ్బులను సింగరేణికి ఆదా చేసింది మోదీ సర్కార్. ఈ బ్లాక్ ద్వారా సంస్థకు రూ. 64 వేల కోట్ల ఆదాయంతో పాటు 1200 అదనపు ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. తాటిచర్ల-2 తమ ప్రయత్నం చెప్పుకుంటున్న కాంగ్రెస్ చెప్పుకుంటోందని ఇదే నిజం అయితే మన్మోహన్ సింగ్ హయంలో ఎందుకు రాలేదన్నారు. ఈ గని రావడం వెనుక కేంద్రప్రభుత్వం, కిషన్ రెడ్డి కృషి ఉందన్నారు. తాడిచర్ల గనిని కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
ధరణిలో అక్రమాలు నిజమే. ధరణితో పాటు భూభారతిలోనూ అవకతవకలు జరిగాయి. ధరణితో పాటు భూభారతిపైనా సిట్ విచారణ జరగాలి. భూభారతిలో అవకతవకలు పడుతున్నాయనే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కన్నెపల్లి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాళేశ్వరం, కూలేశ్వరం కాదు ఈ రెండు పార్టీలు కలిసి చేస్తున్న డ్రామేశ్వరం అని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





