TGSRTC | మీరు బెంగళూరు ప్రయాణికులా.. ఆ బస్సుల్లో మీకు ఫ్రీ జర్నీ
TGSRTC | మీరు బెంగళూరు వెళ్తున్నారా.. అయితే 'పుష్పక్ ఈ-సిటీ (Pushpak AC)' బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. మీ బెంగళూరు ప్రయాణ టికెట్‌ను చూపించి నగరంలో ఈ ఫ్రీ జర్నీ సౌకర్యాన్ని పొందొచ్చు. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రూట్లో నడిచే బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.
- ఆర్టీసీ వినూత్న నిర్ణయానికి ప్రయాణికుల బ్రహ్మరథం
- రోజురోజుకూ పెరుగుతున్న బుకింగ్స్
TGSRTC | త్రినేత్ర.న్యూస్: మీరు బెంగళూరు వెళ్తున్నారా.. అయితే 'పుష్పక్ ఈ-సిటీ (Pushpak AC)' బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. మీ బెంగళూరు ప్రయాణ టికెట్‌ను చూపించి నగరంలో ఈ ఫ్రీ జర్నీ సౌకర్యాన్ని పొందొచ్చు. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రూట్లో నడిచే బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఆర్టీసీ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రోజురోజుకూ బుకింగ్స్ పెరుగుతున్నాయి.
హైదరాబాద్ - బెంగళూరు మధ్య ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రయాణీకులకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. హైదరాబాద్ - బెంగళూరు రూట్లలో ఆర్టీసీ బస్సు సర్వీసు స్థాపింగుల సంఖ్యను పెంచారు. దీంతో పాటు బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు నగరంలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం వల్ల ప్రయాణీకులకు ఆర్థిక భారం తగ్గుతుండగా మరోవైపు ప్రయాణం మరింత సులువైంది. రోజూ అదనంగా 60 నుండి 70 టికెట్లు బుక్ అవుతుండటం విశేషం.
అదనపు సర్వీసులు నడపండి..
ప్రయాణీకుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అదనపు సర్వీసులు నడపాలని ఎండీ నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రయాణీకుల సౌకర్యార్థం, వారి సురక్షిత ప్రయాణమే ధ్యేయంగా కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నామన్నారు. దీనిపై వస్తున్న ఆదరణ చాలా సంతోషాన్నిస్తోందని చెప్పారు. ఈ సదుపాయాన్ని ప్రయాణీకులందరూ మరింత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సంబంధిత వార్తలు

Fire Accident | చాదర్‌ఘాట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన గుడిసెలు
జులై 10, 2026

CM Revanth Reddy | కేసీఆర్.. కరెంట్ వైర్ పట్టుకో కాకిలా మాడిమసై పోతావ్ : సీఎం రేవంత్ రెడ్డి
జులై 10, 2026

CM Revanth Reddy | భద్రాద్రి రాముడి మీద ఒట్టు.. 117కు సీట్లకు పైగా గెలుస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
జులై 10, 2026
తాజావార్తలు
- ●Fire Accident | చాదర్‌ఘాట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన గుడిసెలు
- ●CM Revanth Reddy | అరే బుర్ర తక్కువోడా.. మేడిగడ్డ నింపితే భద్రాచలం రాముడే ఉండడు రా : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | కేసీఆర్.. కరెంట్ వైర్ పట్టుకో కాకిలా మాడిమసై పోతావ్ : సీఎం రేవంత్ రెడ్డి
- ●Tollywood | మిరాయ్ బ్యూటీతో మెగా హీరో హారర్ కామెడీ మూవీ - మాస్ పోస్టర్‌తో రిలీజ్ డేట్ చెప్పేశారుగా!
- ●CM Revanth Reddy | భద్రాద్రి రాముడి మీద ఒట్టు.. 117కు సీట్లకు పైగా గెలుస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
- ●PM Modi | 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌కు భారత ప్రధాని.. మోదీకి ఘన స్వాగతం

Fire Accident | చాదర్‌ఘాట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన గుడిసెలు

CM Revanth Reddy | అరే బుర్ర తక్కువోడా.. మేడిగడ్డ నింపితే భద్రాచలం రాముడే ఉండడు రా : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | కేసీఆర్.. కరెంట్ వైర్ పట్టుకో కాకిలా మాడిమసై పోతావ్ : సీఎం రేవంత్ రెడ్డి

Tollywood | మిరాయ్ బ్యూటీతో మెగా హీరో హారర్ కామెడీ మూవీ - మాస్ పోస్టర్‌తో రిలీజ్ డేట్ చెప్పేశారుగా!



