CM Revanth Reddy | భద్రాద్రి రాముడి మీద ఒట్టు.. 117కు సీట్లకు పైగా గెలుస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | తెలంగాణలో రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. భద్రాద్రి రాముడి మీద ఒట్టేసి చెబుతున్నా.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు పైగా గెలిచి రెండోసారి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం జోస్యం చెప్పారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. భద్రాద్రి రాముడి మీద ఒట్టేసి చెబుతున్నా.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు పైగా గెలిచి రెండోసారి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం జోస్యం చెప్పారు. ఖమ్మం జిల్లాలో చింతకాని మండలంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
కేంద్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాం. తృణమూల్, ఆప్ పార్టీలను చీల్చారు. ఇతర పార్టీలను లొంగదీసుకోవడం.. వారు అనుకున్న బిల్లును రాబోయే పార్లమెంట్‌లో ఆమోదించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ పాపంలో విజయం సాధించడానికి అవకాశం ఉందని సీఎం అన్నారు.
36 నెలల ముందు జోస్యం చెబుతున్నా..
ఆనాడు ఎన్నికలకు ఆరు నెలల ముందు జోస్యం చెప్పి అధికారంలోకి వచ్చాం. నేడు ఎన్నికలకు 36 నెలల ముందు జోస్యం చెబుతున్నా.. అది కూడా ఖమ్మం గడ్డ మీది నుంచి చెబుతున్నా.. 2028 డిసెంబర్‌లో ఎన్నికలు జరగవు. 2029 మే నెలలో ఎన్నికలు జరుగుతాయి. 17 ఎంపీ స్థానాలు 26కు మారుతాయి. 119 ఉన్న అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయి. 182 స్థానాల్లో 117 సీట్లకు పైగా గెలుస్తాం.. మీడియా మిత్రులారా రాసుకోండి.. రెండోసారి తెలంగాణలో ప్రజా పాలనను గెలిపిస్తాం.
ఈ మాట కోసం 18 గంటలు పని చేస్తాం.. ఒక్క క్షణం కూడా అలుపెరగం..
రాముడి మీద ఆన.. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట.. రాసుకో చంద్రశేఖర్ రావు.. నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, ఆయన భజనపరులు రాసుకోండి. నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెంట్లతో సహా రాసిపెట్టుకోండి. ఈనాడు చెప్పిన జోస్యం, ఈ మాట కోసం 18 గంటలు పని చేస్తాం. ఒక్క క్షణం కూడా అలుపెరగం, ఆలస్యం చేయం.. ఎవరికీ కూడా అన్యాయం జరగనివ్వం. తెలంగాణ ప్రజలకు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనార్టీలు విద్యార్థులకు సంక్షేమ ప్రభుత్వం సుభిక్షమైన పాలన అందిస్తుంది.. రామరాజ్యాన్ని తీసుకువస్తుందని సీఎం స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Nepal Floods | నేపాల్లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు
ఆగస్టు 26, 2026

Khelo India Youth Games | డిసెంబర్‌లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!
ఆగస్టు 26, 2026

MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●GV Narayana Rao | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు నారాయణ రావు కన్నుమూత
- ●Kailash Mansarovar Yatra | ఆకస్మిక వరదలు.. తాత్కాలికంగా నిలిచిన కైలాస మానస సరోవర్ యాత్ర!
- ●Travels Bus | ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఏడుగురి మృతి, మరో 8 మందికి గాయాలు
- ●సుస్మిత పొలిటికల్ ఎంట్రీ: కొండా మురళి 'ప్లాన్-బి' వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి?
- ●Horoscope | ఆగస్టు 27 రాశిఫలాలు.. ఈ రాశి వారు సవాళ్లను సులభంగా అధిగమిస్తారు!
- ●Nepal Floods | నేపాల్లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు

GV Narayana Rao | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు నారాయణ రావు కన్నుమూత

Kailash Mansarovar Yatra | ఆకస్మిక వరదలు.. తాత్కాలికంగా నిలిచిన కైలాస మానస సరోవర్ యాత్ర!

Travels Bus | ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఏడుగురి మృతి, మరో 8 మందికి గాయాలు

సుస్మిత పొలిటికల్ ఎంట్రీ: కొండా మురళి 'ప్లాన్-బి' వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి?



