Drunk and Drive | సైబరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. 190 మందిపై కేసులు
Drunk and Drive | నిబంధనలకు విరుధంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై సైబరాబాద్ పోలీసులు (Cyberabad Traffic Police) కొరఢా ఝులిపించారు. కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో (Drunk and Drive) భాగంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
Drunk and Drive | త్రినేత్ర.న్యూస్: నిబంధనలకు విరుధంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై సైబరాబాద్ పోలీసులు (Cyberabad Traffic Police) కొరఢా ఝులిపించారు. కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో (Drunk and Drive) భాగంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 190 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశామని సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ జీ. హన్మంతరావు తెలిపారు. వారిలో 154 మంది ద్విచక్ర వాహనదారులు, 2 ఆటోలు, 34 మంది కార్లు నడిపేవారిపై కేసులు నమోదు చేశామన్నారు. అందులో 16 మంది మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు గుర్తించామని చెప్పారు.
వీరందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపారు.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం తీవ్రమైన నేరమని వెల్లడించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్టంగా పదేండ్ల జైల శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పారు. గత వారం 376 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించాయని పేర్కొన్నారు. వారిలో 10 మందికి జరిమానా, జైలు శిక్ష, 04 మందికి జరిమానా, సోషల్ సర్వీస్, 362 మందికి జరిమానా విధించబడినట్లు తెలిపారు.
సంబంధిత వార్తలు

CP Ramesh | వర్షాకాల సమస్యలపై సీపీ రమేశ్ క్షేత్రస్థాయి పరిశీలన.. నీటి నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
జులై 18, 2026

Traffic Alert | వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్లో 20 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
జులై 15, 2026

Dharma Mahesh | నటుడు ధర్మ మహేశ్ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం..
జులై 10, 2026
తాజావార్తలు
- ●Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు
- ●MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్

Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు

MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?



