Shambipur Raju | కేటీఆర్ కాన్వాయ్‌కి ప్రమాదం.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు గాయాలు
Shambipur Raju | కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్ స్టేషన్ ఘన్‌పూర్ వద్దకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి వేగంగా ఢీకొన్నాయి. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఛాతిలో బలమైన గాయాలయ్యాయి.
Shambipur Raju | త్రినేత్ర.న్యూస్: కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్ స్టేషన్ ఘన్‌పూర్ వద్దకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి వేగంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఛాతిలో బలమైన గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన ఆయనను కొంపల్లిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కార్ల ముందు, వెనుక భాగాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా కన్నెపల్లి పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ నేతల బృందం ఆదివారం ఉదయం బయలుదేరింది. జనగామ జిల్లాలోని పెంబర్తి వద్ద పోలీసులు కాన్వాయ్‌ను అడ్డుకోగా కేటీఆర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ప్రమాదం జరిగిన వెంటనే కేటీఆర్ తన కాన్వాయ్‌ను నిలిపేసి శంభీపూర్ రాజు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం నాయకులతో కలిసి కన్నెపల్లి పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | మట్టి కుండలోనే బోనం చేద్దాం.. చేతివృత్తులను ప్రోత్సహిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Alka Lamba | బీజేపీది.. చందా చోర్ సర్కార్.. మహిళా వ్యతిరేక సర్కార్
- ●Drunk and Drive | సైబరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. 190 మందిపై కేసులు
- ●Vande Bharat Express | భారీ వర్షాలకు నీట మునిగిన పట్టాలు.. దూసుకెళ్లిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. వీడియో
- ●KTR | బీఆర్ఎస్ కన్నేపల్లి పంప్‌హౌస్ సందర్శన.. కేటీఆర్ బృందాన్ని జనగామ వద్ద అడ్డుకున్న పోలీసులు
- ●Hyderabad | కూతురికి మాటలు రావట్లేదని.. 12వ అంతస్తు పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

Ponnam Prabhakar | మట్టి కుండలోనే బోనం చేద్దాం.. చేతివృత్తులను ప్రోత్సహిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్

Alka Lamba | బీజేపీది.. చందా చోర్ సర్కార్.. మహిళా వ్యతిరేక సర్కార్

Drunk and Drive | సైబరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. 190 మందిపై కేసులు

Vande Bharat Express | భారీ వర్షాలకు నీట మునిగిన పట్టాలు.. దూసుకెళ్లిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. వీడియో





