Uttarakhand | సంపూర్ణ అక్షరాస్యత సాధించిన ఆరో రాష్ట్రంగా ఉత్తరాఖండ్
Uttarakhand | దేశంలో సంపూర్ణ అక్షరాస్యత (Fully Literate State) కలిగిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ (Uttarakhand) చరిత్ర సృష్టించింది. అంతకుముందు మిజోరాం (Mizoram), గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ హోదాను పొందాయి.
Uttarakhand | త్రినేత్ర.న్యూస్: దేశంలో సంపూర్ణ అక్షరాస్యత (Fully Literate State) కలిగిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ (Uttarakhand) చరిత్ర సృష్టించింది. జాతీయ విద్యా విధానం- 2020, ఉల్లాస్ (Ullas) కార్యక్రమం కింద కేంద్ర విద్యా శాఖ పరిధిలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం నిర్దేశించిన వయోజన అక్షరాస్యత ప్రమాణాలను పూర్తి చేయడం ద్వారా రాష్ట్రం ఈ మైలురాయిని సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని సంపూర్ణత అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ప్రకటించే ప్రతిపాదనకు ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ ఆమోదం తెలిపారు.
దీంతో దేశంలో సంపూర్ణ అక్షరాస్యత కలిగిన ఆరో రాష్ట్రంగా (sixth state) ఉత్తరాఖండ్ నిలిచింది. అంతకుముందు మిజోరాం (Mizoram), గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ హోదాను పొందాయి. రాష్ట్రం మొత్తం జనాభాలో 15 ఏండ్లు పైబడినవారిలో 95 శాతం మంది చదవడం, రాయడం (literacy rate) చేయగలితే ఆ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్లుగా గుర్తిస్తారు. ఉత్తరాఖండ్‌లో అక్షరాస్యులు 98 శాతానికిపైగా ఉన్నారు. దీంతో సంపూర్ణ అక్షరాస్యత కలిగిన ఆరో రాష్ట్రంగా నిలిచింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో లడఖ్ (Ladakh) సంపూర్ణ అక్షరాస్యత కలిగిన తొలి యూటీగా రికార్డు సాధించింది. ఇక మిజోరాంలో 100 శాతం అక్షరాస్యులు ఉన్నారు.
ప్రభుత్వ కృషికి తోడైన ప్రజల భాగస్వామ్యం..
ఇది రాష్ట్రానికి ఒక మైలురాయి అని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ప్రభుత్వ నిరంతర కృషికి ప్రజల భాగస్వామ్యం తోడవడంతో ఈ ఘనతను సాధించగలిగామని చెప్పారు. ఇలాంటి సామూహిక కృషి 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, నిరంతర విద్య, జీవన నైపుణ్యాలు ప్రతి పౌరుడికి చేరేలా తమ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. కాగా, ఉత్తరాఖండ్‌ను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ప్రకటించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం జూన్ 19న ఆమోదం తెలిపింది.
సంబంధిత వార్తలు

Heavy Rain | దేశవ్యాప్తంగా ముంచెత్తిన భారీ వర్షాలు.. నీట మునిగిన ఢిల్లీ.. కశ్మీర్, కేరళ అతలాకుతలం
జులై 9, 2026

Harsil Valley | ఉత్తరాఖండ్‌లో దాగి ఉన్న ఈ లోయ నిజమైన స్వర్గం.. ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం..
జూన్ 20, 2026

Char Dham Yatra | చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. వర్షాకాలం నేపథ్యంలో ఆలయ కమిటీ కీలక విజ్ఞప్తి
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్

MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?

Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం



