Lenin Censor Review | లెనిన్ సెన్సార్ రివ్యూ – అఖిల్, భాగ్యశ్రీ రొమాన్స్ హైలైట్ – ఆ ట్విస్ట్ మాత్రం షాకింగ్…
అఖిల్ అక్కినేని లెనిన్ మూవీకి సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ యాక్షన్ లవ్‌స్టోరీకి అఖిల్, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలుస్తుందని అంటున్నారు. స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో సెకండాఫ్ థ్రిల్లింగ్‌గా సాగుతుందని సెన్సార్ సభ్యుల నుంచి టాక్ వినిపిస్తోంది. వరల్డ్ వైడ్‌గా లెనిన్ మూవీ 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అవుతోంది.
Entertainment | Published On Jul 9, 2026, 11.38 am IST
Lenin Censor Review | అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లెనిన్ మూవీ ఈ శుక్రవారం (జూలై 10న) థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. సూర్యదేవర నాగవంశీతో కలిసి హీరో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించబోతుంది. మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వం వహించారు. హీరోగా అఖిల్ ఇప్పటివరకు ఆరు సినిమాలు చేశాడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదమూడేళ్లు దాటిపోయింది. కానీ హిట్టు మాత్రం కొట్టలేదు. లెనిన్ మూవీ అఖిల్ కెరీర్‌కు అగ్ని పరీక్షలా మారింది. హిట్టు కోసం రూటెడ్ స్టోరీని ఎంచుకున్నాడు. హీరోయిజం, ఎలివేషన్లు ఎక్కువగా లేకుండా కేవలం యాక్షన్, ఎమోషన్స్‌పైనే ఈ సారి ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు ట్రైలర్, టీజర్స్ చూస్తుంటే తెలుస్తోంది.
సెన్సార్ కంప్లీట్....
కాగా లెనిన్ మూవీ సెన్సార్ పూర్తయ్యింది. యూ ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అఖిల్ అక్కినేని భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. వారిద్దరి లవ్‌స్టోరీ, రొమాంటిక్ సీన్లు, డ్యూయెట్స్ అన్ని వర్కవుట్ అయినట్లు సమాచారం. సెకండాఫ్ ఈ సినిమాకు కీలకమని అంటున్నారు. స్ట్రాంగ్ ఎమోషనల్ సీన్లతో థ్రిల్లింగ్‌గా దర్శకుడు ద్వితీయార్థాన్ని నడిపించాడని సెన్సార్ నుంచి టాక్ వచ్చింది. యాక్షన్ సీన్లు అదిరిపోతాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్‌లు గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే పాత్రకు సంబంధించి ఓ షాకింగ్ ట్విస్ట్ ఉంటుందట. ఆ మలుపు పైనే సినిమా రిజల్ట్ మొత్తం ఆధారపడి ఉంటుందని అంటున్నారు. తమన్ బీజీఎమ్ థియేటర్లలో హై ఫీల్‌ను ఇస్తుందని చెబుతున్నారు.
ఓటీటీ రైట్స్...
అఖిల్ గత మూవీ రిజల్ట్‌లతో సంబంధం లేకుండా లెనిన్ నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరిగింది. ఓటీటీ, శాటిలైట్ హక్కులు 18 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. హిందీ డబ్బింగ్ రైట్స్ 8 కోట్లు, మ్యూజిక్ హక్కుల ద్వారా మరో ఆరు కోట్ల వరకు నిర్మాతలకు వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా 32 కోట్ల నాన్ థియేట్రికల్ హక్కుల బిజినెస్ రిలీజ్‌కు ముందే పూర్తయ్యింది. లెనిన్ థియేట్రికల్ బిజినెస్ 24 కోట్ల వరకు జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇప్పుడున్న హైప్ ప్రకారం చూసుకుంటే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ టార్గెట్‌ను రీచ్ కావడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ టాక్ ఏమన్న అటు ఇటు అయితే మాత్రం కష్టమేనని అంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!
- ●Khushi Kapoor | రెడ్ డ్రెస్‌లో జాన్వీ చెల్లెలి సోయగాలు - నెక్స్ట్ టార్గెట్ టాలీవుడ్
- ●Vaddiraju Ravichandra | ఎస్ఐఆర్ 10 శాతమే పూర్తయింది.. ఇంకా సమయం పెంచాలి
- ●Horror OTT | ఓటీటీలోకి మైండ్‌బ్లాక్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు హారర్ మూవీ - కాటేరమ్మ కథతో

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..

Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?

Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Khushi Kapoor | రెడ్ డ్రెస్‌లో జాన్వీ చెల్లెలి సోయగాలు - నెక్స్ట్ టార్గెట్ టాలీవుడ్




