త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Newlywed bride collapsed | గ‌దిలోకి అడుగుపెట్టిన క్ష‌ణాల్లోనే కుప్ప‌కూలి ప్రాణాలు కోల్పోయిన న‌వవ‌ధువు.. లోప‌ల ఏం జ‌రిగింది..?

Newlywed bride collapsed | హోట‌ల్ గ‌దిలోకి వెళ్లిన సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే ఓ న‌వవ‌ధువు అనుమానాస్ప‌ద స్థితిలో ప్రాణాలు కోల్పోన (Newlywed bride collapsed) ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) ఝాన్సీ (Jhansi)లో చోటు చేసుకుంది.

D

National | Published On Oct 26, 2026, 5.19 pm IST

Newlywed bride collapsed | గ‌దిలోకి అడుగుపెట్టిన క్ష‌ణాల్లోనే కుప్ప‌కూలి ప్రాణాలు కోల్పోయిన న‌వవ‌ధువు.. లోప‌ల ఏం జ‌రిగింది..?
Advertisement

Newlywed bride collapsed | త్రినేత్ర న్యూస్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) ఝాన్సీ (Jhansi)లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. హోట‌ల్ గ‌దిలోకి వెళ్లిన సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే ఓ న‌వవ‌ధువు అనుమానాస్ప‌ద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది (Newlywed bride collapsed). ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

28 ఏళ్ల ముస్కాన్ (Muskan)కు నాలుగు నెలల క్రితం వివాహ‌మైంది. త‌న భ‌ర్త నీలేశ్‌తో క‌లిసి ముస్కాన్ ఝాన్సీలోని ఓ హోట‌ల్‌కు వెళ్లింది. ఆమె త‌న భ‌ర్త‌, మ‌రో వ్య‌క్తితో హోట‌ల్ కారిడార్‌లో న‌డుచుకుంటూ వెళ్తోంది. తొలుత భ‌ర్త‌, మ‌రో వ్య‌క్తి హోట‌ల్ గ‌దిలోకి వెళ్లారు. వారి నెన‌కే ముస్కాన్ కూడా గ‌దిలోకి అడుగుపెట్టింది. అంతే లోప‌ల ఏం జ‌రిగింతో తెలియ‌దు కానీ, సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే ముస్కాన్ గ‌ది గుమ్మం వ‌ద్దే ఒక్క‌సారిగా కుప్ప‌కూలి ప‌డిపోయింది. వెంట‌నే భ‌ర్త బ‌య‌ట‌కు వ‌చ్చి ఆమెను ఎత్తుకుని లోప‌లికి తీసుకెళ్లాడు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధ‌రించారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు హోట‌ల్ కారిడార్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి.

అయితే, త‌మ కుమార్తెది ముమ్మాటికీ హ‌త్యేన‌ని బాధితురాలి త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నీలేశే ముస్కాన్‌ను హ‌త్య చేశాడ‌ని ఆరోపించారు. నీలేశ్‌కు ఇది వ‌ర‌కే పెళ్లైంద‌ని.. ఆ విష‌యం దాచిపెట్టి ముస్కాన్‌ను పెళ్లి చేసుకున్నాడ‌ని తెలిపారు. పెళ్లైన త‌ర్వాత నీలేశ్‌కు అప్ప‌టి కే పెళ్లైన విష‌యం త‌మ‌కు తెలిసింద‌న్నారు. మొద‌టి భార్య ఇండోర్‌లో ఉంటుంద‌ని చెప్పారు. ఈ విష‌యంలో భార్య భ‌ర్త‌ల మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు. మొద‌టి భార్య‌తో పోల్చుతూ ముస్కాన్‌ను నీలేశ్ త‌ర‌చూ వేధించేవాడ‌ని ఆరోపించారు. బాధిత కుటుంబ స‌భ్యుల ఆరోప‌ణ‌ల మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. నీలేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక త‌ర్వాత త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

Also Read..

ఫామ్‌ 6 సమర్పించినందుకు ఓటర్లపై ఎలాంటి ప్రాసిక్యూషన్ ఉండదు.. సుప్రీంకోర్టు భ‌రోసా

కాంగ్రెస్ ఢిల్లీ మహా ర్యాలీకి వేళాయె: రంగంలోకి టీపీసీసీ కీలక కమిటీ.. మంత్రులు, ఎంపీలకు బాధ్యతలు

ద‌ళారుల‌కే ధాన్యం అమ్ముకోండి.. రైతుల‌కు మంత్రి పొన్నం సూచ‌న‌

Advertisement
Advertisement