Fake Death | హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి.. ఏఐ సహాయంతో చనిపోయినట్లు డ్రామా..
Fake Death | మేక మొండెం.. తన తల.. రెండిటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో కలిపాడు. తాను చనిపోయినట్లు, అంత్యక్రియల తంతుకు సంబంధించిన ఫొటోను (Fake Death) సృష్టించాడు. ఆ తప్పుడు ఆధారాలతో మరణ ధృవీకరణ పత్రం (Death Certificate) కూడా తీసుకున్నాడు.
Fake Death | త్రినేత్ర న్యూస్: మేక మొండెం.. తన తల.. రెండిటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో కలిపాడు. తాను చనిపోయినట్లు, అంత్యక్రియల తంతుకు సంబంధించిన ఫొటోను (Fake Death) సృష్టించాడు. ఆ తప్పుడు ఆధారాలతో మరణ ధృవీకరణ పత్రం (Death Certificate) కూడా తీసుకున్నాడు. దానిని కోర్టులో సర్పించాడు. ఇందంతా ఎందుకు చేశాడని అనుకుంటున్నారా.. హత్య కేసు విచారణ (Murder Trial) నుంచి తప్పించుకోవడానికి. అయితే అబద్ధం ఎక్కువ రోజులు దాగదు కదా.. ఏడాదిగా తప్పించుకు తిరుగుతున్న అతడు చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మౌ (Mau) జిల్లాలో చోటుచేసుకుంది.
రాజ్‌కుమార్ రాజ్‌భర్ (38) అనే వ్యక్తి ఓ హత్య కేసులో (Murder Case) నిందితుడిగా ఉన్నాడు. అదేవిధంగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఆరోపణలు కూడా అతనిపై ఉన్నాయి. 2016 డిసెంబర్ 19న మున్షీపురా రైల్వే లైన్ సమీపంలో యోగేష్ సింగ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈఘటనలో రాజ్‌కుమార్, అతని స్నేహితుడు సుదర్శన్ రాజ్‌భర్‌పై (Rajkumar Rajbhar) హత్య కేసు నమోదైంది. దీంతో ఇద్దరు అప్పటి నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి రాజ్‌భర్ ఓ ప్లాన్ వేశాడు.

2025 మే 30న ఒక చనిపోయిన మేకకు ఘాజీపూర్‌లో అంత్యక్రియలు ఏర్పాటు చేశాడు. ఆ చితిపై ఉన్న మేక శరీరానికి బదులుగా.. ఏఐ హాయంతో తన శవం ఉన్నట్లుగా ఒక నకిలీ ఫొటోను (AI-Generated Funeral) సృష్టించాడు. ఏఐతో సృష్టించిన ఫోటోలు, అంత్యక్రియల (Funeral) తంతుకు సంబంధించిన తప్పుడు ఆధారాలను చూపించి మున్సిపల్ ఆఫీస్ నుంచి మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా పొందాడు. తాను చనిపోయినట్లు నమ్మించడానికి ఆ సర్టిఫికెట్‌ను కోర్టుకు సమర్పించాడు. తాను బతికి లేకపోవడంతో తనపై విచారణ నిలిపివేయాలని న్యాయస్థానానికి పత్రాలు కూడా సమర్పించాడు. ఏడాదిన్నరగా తప్పించుకు తిరుగుతున్నాడు.
అయితే ఆదివారం (అక్టోబర్ 25) ఉదయం 9 గంటల సమయంలో ఖ్వాజాజహాన్‌పూర్ ప్రాంతంలో కొత్వాలి నగర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఇంటర్మీడియట్ కూడా పాస్‌కాని రాజ్‌కుమార్ రాజ్‌భర్.. స్టాక్ మార్కెట్ ట్రేడర్‌గా పని చేసేవాడని అదనపు పోలీస్ సూపరింటెండెంట్ అనూప్ కుమార్ తెలిపారు. మార్కెట్‌లో పెట్టుబడి పెడతానని చెప్పి పలు నగరాల్లో ప్రముఖుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడని వెల్లడారు. హత్య కేసు నుంచి తప్పించుకోవడంతో పాటు, ఆ డబ్బును తిరిగి చెల్లించకుండా ఉండటానికే అతడు చనిపోయినట్లు డ్రామా ఆడాడని చెప్పారు. ప్రస్తుతానికి అతను మళ్లీ బతికి రావడంతో హత్య కేసు విచారణతో పాటు, ఫోర్జరీ (నకిలీ పత్రాల సృష్టి) కింద అతనిపై మరో కొత్త కేసు కూడా నమోదుచేసినట్లు తెలిపారు.
సంబంధిత వార్తలు

Software Employee | మాదాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..
అక్టోబర్ 25, 2026

Lord Uday Nagaraju | దూసుకుపోతున్న ఏఐ టెక్నాలజీ.. పార్లమెంటరీ వ్యవస్థలూ అంతేవేగంగా స్పందించాలి: లార్డ్ ఉదయ్ నాగరాజు
అక్టోబర్ 24, 2026

Auraiya UP Viral Engagement Video | 75 ఏళ్ల వరుడు, 30 ఏళ్ల వధువు.. కూతురి ఫ్రెండ్‌తోనే పెళ్లి : వీడియో వైరల్
అక్టోబర్ 15, 2026
తాజావార్తలు
- ●Horoscope | అక్టోబర్ 26 సోమవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
- ●Telangana Schools Holiday | విద్యార్థులకు గుడ్‌న్యూస్: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- ●Modi Ka Baap Bhi Jayega Controversy | 'మోదీ కా బాప్ భీ జాయేగా': పాట్నా సభలో సహనం కోల్పోయిన మల్లికార్జున ఖర్గే
- ●ABN Radhakrishna Family Dispute | ఏబీఎన్ ఆర్కే కుటుంబంలో లీడర్షిప్ మార్పుల కలకలం.. అల్లుడు కోగంటి భాను సంచలన ట్వీట్, ఆపై క్లారిఫికేషన్!
- ●Navi Mumbai Airport | విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్: నవీ ముంబై కొత్త ఎయిర్‌పోర్ట్‌కు ఇండిగో, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ షిఫ్ట్
- ●Tirumala Vaikunta Ekadasi Darshan Slot Bookings |18 -50 ఏళ్ల వారికే తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనం.. ఐదు విడతల్లో స్లాట్లు

Horoscope | అక్టోబర్ 26 సోమవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Telangana Schools Holiday | విద్యార్థులకు గుడ్‌న్యూస్: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Modi Ka Baap Bhi Jayega Controversy | 'మోదీ కా బాప్ భీ జాయేగా': పాట్నా సభలో సహనం కోల్పోయిన మల్లికార్జున ఖర్గే

ABN Radhakrishna Family Dispute | ఏబీఎన్ ఆర్కే కుటుంబంలో లీడర్షిప్ మార్పుల కలకలం.. అల్లుడు కోగంటి భాను సంచలన ట్వీట్, ఆపై క్లారిఫికేషన్!



