Anandiben Patel | మహిళలు ఐఏఎస్‌లుగా, ఉపాధ్యాయులుగా ఎదగడానికి ముందు.. నిపుణురాలైన తల్లిగా మారలి: యూపీ గవర్నర్
Anandiben Patel | మహిళలు ఐఏఎస్ అధికారులు (IAS officers), ఉపాధ్యాయులు (Teachers) కావడానికి ముందే ఒక నిపుణురాలైన తల్లిగా (Expert Mothers) మారాలని ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ (Anandiben Patel) అన్నారు. మహిళలకు కుంటుంబ బాధ్యతలే తొలిప్రాధాన్యం అని చెప్పారు.
Anandiben Patel | త్రినేత్ర.న్యూస్: మహిళలు ఐఏఎస్ అధికారులు (IAS officers), ఉపాధ్యాయులు (Teachers) కావడానికి ముందే ఒక నిపుణురాలైన తల్లిగా (Expert Mothers) మారాలని ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ (Anandiben Patel) అన్నారు. మహిళలకు కుంటుంబ బాధ్యతలే తొలిప్రాధాన్యం అని చెప్పారు. పెండ్లి తర్వాత చదువును ఆపకూడదని సూచించారు. కాన్పూర్‌లోని ఛత్రపతి సాహూజీ మహారాజ్ విశవిద్యాలయ (CSJMU) 41వ స్నాతకోత్సవంలో ఆమె ప్రసంగించారు. మీరు ఐఏఎస్ అధికారి అయినా, ఉపాధ్యాయురాలైనా మొదట ఇంట్లో పిల్లలను పెంచే నిపుణురాలైన తల్లిగా మారాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఇంట్లో వంట చేయడం తెలిసి ఉండాలని చెప్పారు. వృత్తిపరమైన విజయం కోసం కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయకూడదని హితవు పలికారు. యువతులు వివాహం తర్వాత కూడా తమ చదువును, కెరీర్‌ను కొనసాగించాలని సూచించారు. తద్వారా తమ నైపుణ్యాలను దేశ నిర్మాణానికి ఉపయోగించాలన్నారు.
పిల్లలను స్కూళ్లు, కాలేజీల్లో చేర్పించగానే తల్లిదండ్రుల బాధ్యత తీరిపోలేదని, వారు విద్యాసంస్థల్లో ఏం చేస్తున్నారో గమనించాలని సూచించారు. పర్యవేక్షణలో చిన్న లోపం జరిగినా వారి భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. సమాజంలో డిగ్రీలు పెరుగుతున్నా మహిళలపై నేరాలు, గృహహింస తగ్గకపోవడం విద్యావ్యవస్థలోని లోపాలను సూచిస్తుందని చెప్పారు. కేవలం మార్కుల కోసమే కాకుండా నైతిక విలువలతో కూడిన విద్యే ముఖ్యమని స్పష్టం చేశారు. విద్య కేవలం విద్యాపరమైన విజయాలకే పరిమితం కాకూడదని, కుటుంబ విలువలు, తల్లిదండ్రుల బాధ్యత, వ్యక్తిత్వ నిర్మాణం గురించికూడా నేర్పించాలన్నారు. గృహ హింస, మహిళలపై నేరాలు పెరగడానికి క్షీణిస్తున్న నైతిక విలువలే కారణమని పేర్కొన్నారు. విద్యను కేవలం డిగ్రీలు, మార్కులతో మాత్రమే కొలవకూడదని చెప్పారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Smart Television | LED, QLED, OLED టీవీలు.. ఏది బెస్ట్? తేడాలు తెలుసుకుంటే సరైన ఎంపిక సులభం..
- ●Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!
- ●Kishan Reddy | ప్రత్యేక వెసులుబాటుతో తాడిచర్ల-2 గనిని సింగరేణికి కేటాయించాం: కిషన్‌రెడ్డి
- ●Dharma Mahesh | నటుడు ధర్మ మహేశ్ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం..
- ●CM Vijay | సీఎం విజయ్‌కి భారీ ఊరట.. కరూర్ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిచ్చేందుకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- ●SBI Funds Management IPO | ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ.. షేర్ ధర రూ.574, రిటైల్ పెట్టుబడిదారులు ఎంత పెట్టాలి?

Smart Television | LED, QLED, OLED టీవీలు.. ఏది బెస్ట్? తేడాలు తెలుసుకుంటే సరైన ఎంపిక సులభం..

Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!

Kishan Reddy | ప్రత్యేక వెసులుబాటుతో తాడిచర్ల-2 గనిని సింగరేణికి కేటాయించాం: కిషన్‌రెడ్డి

Dharma Mahesh | నటుడు ధర్మ మహేశ్ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం..






