2008 DSC Postings | సీఎం రేవంత్ చిత్రపటానికి 2008 డీఎస్సీ టీచర్ల పాలాభిషేకం
DSC Postings | అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2008 డీఎస్సీ అభ్యర్థులు 1,175 మందిని ఉపాధ్యాయులుగా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చిత్రపటానికి వారు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు.
DSC Postings | త్రినేత్ర.న్యూస్: అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2008 డీఎస్సీ అభ్యర్థులు 1,175 మందిని ఉపాధ్యాయులుగా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ కు మంగళవారం సదరు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చిత్రపటానికి వారు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు.
ప్రజాభవన్‌కు తరలొచ్చిన ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. 17 సంవత్సరాలుగా టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తమకు చివరికి సీఎం రేవంత్ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నారని వారు సంతోషం వ్యక్తం చేశారు.
కొత్త జిల్లాల ప్రాతిపదికన పోస్టింగ్ ఇవ్వాలని వినతి..
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పోస్టింగ్స్ ఇచ్చారని, అయితే కొత్త జిల్లాల ప్రాతిపదికన పోస్టింగ్స్ మార్చాలని వారు సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ చిన్నారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. సర్వీస్ సమస్యలు కూడా పరిష్కరించాలని కోరారు. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చిన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు.
తాజావార్తలు
- ●Vakiti Srihari | రూ. 47.03 కోట్లతో హోల్ సేల్ చేపల మార్కెట్
- ●ITR Filing | ఐటీఆర్ రీఫండ్ ఇక వేగంగా.. 7-10 రోజుల్లోనే ఖాతాలో డబ్బు.. స్టేటస్ ఇలా చెక్ చేయండి..
- ●Tihar Jail | తీహార్ జైల్లో పెట్టే ఆహారం తినలేకపోతున్నా.. వంట చేసుకునేందుకు అనుమతివ్వండి.. కోర్టును ఆశ్రయించిన ఖైదీ
- ●Etala Rajendar | నీళ్లెత్తిపోయండని చెప్తున్నాం.. అర్థమవుతుందా రేవంత్‌రెడ్డి గారూ..: ఈటల
- ●Smart Television | LED, QLED, OLED టీవీలు.. ఏది బెస్ట్? తేడాలు తెలుసుకుంటే సరైన ఎంపిక సులభం..
- ●Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!

Vakiti Srihari | రూ. 47.03 కోట్లతో హోల్ సేల్ చేపల మార్కెట్

ITR Filing | ఐటీఆర్ రీఫండ్ ఇక వేగంగా.. 7-10 రోజుల్లోనే ఖాతాలో డబ్బు.. స్టేటస్ ఇలా చెక్ చేయండి..

Tihar Jail | తీహార్ జైల్లో పెట్టే ఆహారం తినలేకపోతున్నా.. వంట చేసుకునేందుకు అనుమతివ్వండి.. కోర్టును ఆశ్రయించిన ఖైదీ

Etala Rajendar | నీళ్లెత్తిపోయండని చెప్తున్నాం.. అర్థమవుతుందా రేవంత్‌రెడ్డి గారూ..: ఈటల




