Harish Rao | 30 డీఈవో పోస్టులను తక్షణమే భర్తీ చేయండి.. కాంగ్రెస్ సర్కార్‌కు హరీశ్‌రావు డిమాండ్
Harish Rao | రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30 డీఈవో పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. 30 డీఈవో పోస్టులు ఖాళీగా పెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసింది అని మండిపడ్డారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30 డీఈవో పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. 30 డీఈవో పోస్టులు ఖాళీగా పెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసింది అని మండిపడ్డారు. సిద్దిపేట రెడ్డి సంఘంలో ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరీశ్ రావు హాజరై ప్రసంగించారు.
రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే కేవలం ముగ్గురే రెగ్యులర్ డీఈఓలు ఉన్నారు. 30 చోట్ల పోస్టులు ఖాళీగా పెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసింది. అదనపు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, ఐఏఎస్ అధికారులకు డీఈఓ బాధ్యతలు అప్పగించడం వల్ల వారు విద్యపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం రెగ్యులర్ డీఈఓలను నియమించాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
రాజకీయ కక్షతో మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి బడుల అభివృద్ధిని కుంటుపరిచారు. కావాలంటే పథకం పేరు మార్చుకోవాలి కానీ, బడుల అభివృద్ధిని ఆపొద్దు. కొత్తగా పాఠశాలల్లో ఒక్క గది కూడా కట్టే ప్రయత్నం చేయడం లేదు. పాఠశాలల్లో స్కావెంజర్ల బిల్లులు గత ఏడాదివి నాలుగు నెలలు, ఈ ఏడాదివి నాలుగు నెలలు పెండింగ్‌లో ఉండటంతో ఆ భారం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై పడుతోంది. పెండింగ్ బిల్లులు, డీఏల సమస్యలతో పాటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ప్రభుత్వం ఉపాధ్యాయులను తీవ్ర ఆర్థిక క్షోభకు గురిచేస్తోంది అని హరీశ్‌రావు అన్నారు.
సంబంధిత వార్తలు

Minister Seethakka | చదువే ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం : మంత్రి సీతక్క
మే 30, 2026

MLC Deshapathi Srinivas | ఇదా రేవంత్ సర్కార్ పాటిస్తున్న ప్రజాస్వామ్యం..? బాల్క సుమన్ అరెస్టుపై ఎమ్మెల్సీ దేశపతి ఫైర్
మే 30, 2026

Bollam Mallaiah Yadav | రైతుల మరణాలపై సీఎం రేవంత్ అవహేళన మాటలు.. మండిపడ్డ మల్లయ్య యాదవ్
మే 30, 2026
తాజావార్తలు
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!
- ●Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు 'కారుణ్య మరణం' ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన
- ●Peddi Movie | పెద్ది తెలంగాణలో షాక్.. ధరల పెంపును నో చెప్పిన హైకోర్టు..!
- ●Delhi Dust Storm | ఢిల్లీని వణికించిన గాలి దుమారం: గంటకు 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షం

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల

Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక

TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు 'కారుణ్య మరణం' ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన



