త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Electricity Prices | వినియోగ‌దారుల‌కు ‘కరెంట్’ షాకిచ్చిన ప్ర‌భుత్వం.. 10 శాతం పెరగనున్న విద్యుత్ బిల్లు

Electricity Prices | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) ప్ర‌భుత్వం తాజాగా షాకింగ్ న్యూస్ చెప్పింది. కరెంట్ బిల్లులను (Electricity Prices) 10 శాతం పెంచుతున్నట్లు ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (UP Power Corporation) అధికారికంగా ప్రకటించింది.

D

National | Published On May 30, 2026, 3.59 pm IST

Electricity Prices | వినియోగ‌దారుల‌కు ‘కరెంట్’ షాకిచ్చిన ప్ర‌భుత్వం.. 10 శాతం పెరగనున్న విద్యుత్ బిల్లు
Advertisement

Electricity Prices | ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపుతో ఇప్ప‌టికే అల్లాడిపోతున్న ప్ర‌జ‌లకు.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) ప్ర‌భుత్వం తాజాగా షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇంధన ధరల పెరుగుదల, విద్యుత్ కొనుగోలు వ్యయం ఎక్కువ కావడంతో.. జూన్ నెల నుంచి కరెంట్ బిల్లులను (Electricity Prices) 10 శాతం పెంచుతున్నట్లు ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (UP Power Corporation) అధికారికంగా ప్రకటించింది.

జూన్ బిల్లింగ్ సైకిల్ నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేర‌కు శ‌నివారం నోటిఫికేష‌న్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, రెగ్యులేటరీ కమిషన్ నిబంధనల ప్రకారమే ఈ అదనపు 'ఇంధన సర్ఛార్జ్' (fuel surcharge) విధిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇంధనం, విద్యుత్ కొనుగోలుకు అయ్యే అద‌న‌పు ఖ‌ర్చును 'ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ అడ్జస్ట్‌మెంట్ సర్ఛార్జ్' (ఎఫ్​పీపీఏఎస్) కింద‌ వినియోగదారుల నుంచి రికవరీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఏదైనా ఒక నిర్ద‌ష్ట నెల‌లో అద‌నంగా అయ్యే విద్యుత్ కొనుగోలు, ట్రాన్స్మిష‌న్ ఖ‌ర్చుల‌ను మూడు నెల‌ల త‌ర్వాత వినియోగ‌దారుల నుంచే వ‌సూలు చేస్తార‌ని రెగ్యులేటరీ అఫైర్స్ యూనిట్ (RAU) చీఫ్ ఇంజనీర్ పంకజ్ సక్సేనా తెలిపారు. అంటే, మార్చి నెల‌లో అయిన అదనపు ఖర్చును జూన్ నెల‌లో 'ఎఫ్​పీపీఏఎస్' రూపంలో వినియోగదారుల నుంచి వ‌సూలు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న‌ వివరించారు. ఈ 10 శాతం అదనపు బాదుడు రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల‌కు.. అంటే కేవలం పరిశ్రమలకు మాత్ర‌మే కాకుండా.. సాధారణ ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు సమానంగా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read..

ఆల‌యాల్లో వీఐపీ ద‌ర్శ‌నం పేరుతో అడ్డ‌గోలు వ‌సూళ్లు.. మారువేషంలో వెళ్లి షాకిచ్చిన మంత్రి

ఐటీ జాబ్ వ‌దిలి ఆటో స్టీరింగ్ ప‌ట్టిన మ‌హిళ‌.. నెల‌కు ఎంత సంపాదిస్తోందంటే..?

జీవో 17 ర‌ద్దు అయ్యే దాకా పోరాడుదాం.. కాంట్రాక్ట‌ర్ల‌కు కేటీఆర్ పిలుపు

Advertisement
Advertisement