త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | జీవో 17 ర‌ద్దు అయ్యే దాకా పోరాడుదాం.. కాంట్రాక్ట‌ర్ల‌కు కేటీఆర్ పిలుపు

KTR | కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీవో 17 ర‌ద్దు అయ్యే దాకా పోరాటం చేద్దామ‌ని కాంట్రాక్ట‌ర్ల‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ జీవో విష‌యంలో రేవంత్‌కు బుద్ది చెప్పే దాకా, ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు కాంట్రాక్టులు వ‌చ్చేదాకా ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను వ‌దిలిపెట్టొద్ద‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు.

S

Telangana | Published On May 30, 2026, 3.23 pm IST

KTR | జీవో 17 ర‌ద్దు అయ్యే దాకా పోరాడుదాం.. కాంట్రాక్ట‌ర్ల‌కు కేటీఆర్ పిలుపు
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీవో 17 ర‌ద్దు అయ్యే దాకా పోరాటం చేద్దామ‌ని కాంట్రాక్ట‌ర్ల‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ జీవో విష‌యంలో రేవంత్‌కు బుద్ది చెప్పే దాకా, ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు కాంట్రాక్ట‌ులు వ‌చ్చేదాకా ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను వ‌దిలిపెట్టొద్ద‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఇందిరా పార్కు వ‌ద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్ట‌ర్స్ అసోసియేష‌న్ ధ‌ర్నా కార్య‌క్ర‌మంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

కేసీఆరేమో తొమ్మిదిన్న‌రేండ్ల పాటు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ లాంటి అద్భుతమైన‌ ఆఫీస‌ర్ల‌కు అవ‌కాశం ఇచ్చి స్వేచ్ఛ‌గా ప‌ని చేయాల‌న్నారు. సంప‌ద పెంచాలి.. పేద‌ల‌కు పంచాల‌ని నినాదం ఇచ్చారు. 1022 గురుకుల పాఠ‌శాల‌ల్లో ఆరున్న‌ర ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించారు. ఒక్కో విద్యార్థి మీద ల‌క్షా 20 వేల ఖ‌ర్చు పెట్టార‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

పేమెంట్ కోటాలో సీఎం సీటు కొట్టిండు రేవంత్ రెడ్డి

ఈ ప్ర‌భుత్వం వ‌చ్చాక మాయ‌మాట‌లు, ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్పి డిక్ల‌రేష‌న్ల పేరిట అన్ని వ‌ర్గాల‌ను మోసం చేశారు. అబ‌ద్దాల‌తో గ‌ద్దెనెక్కారు.. పేమెంట్ కోటాలో సీఎం సీటు కొట్టిండు రేవంత్ రెడ్డి. నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు, కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేస్తామ‌న్నాడు. మ‌రి ఏమైంద‌ని అడిగితే మీకు తెల్వ‌దా.. కండ‌లు తిరిగినా ప‌హిల్వాన్ అయినా మూడు నెల‌ల్లో పిల్ల‌ల‌ను పుట్టిస్తారా..? అని రేవంత్ అంటున్న‌డు. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్ట‌ర్ల జేఏసీ వేదిక‌గా చెబుతున్నా.. మూడు నెల‌ల్లో పిల్ల‌లు పుట్ట‌ర‌ని అంద‌రికీ తెలుసు. 30 నెల‌ల్లో కూడా పిల్ల‌లు పుట్ట‌క‌పోతే నిన్ను ఏమ‌ని పిల‌వాలి. చేత‌కానోడు అనాల్నా.. ఏమ‌నాలి అని కేటీఆర్ నిల‌దీశారు.

శ్వేత ప‌త్రం విడుద‌ల చేసే ద‌మ్ముందా..?

18 శాతం ఎస్సీల‌కు, 12 శాతం ఎస్టీల‌కు, 42 శాతం బీసీల‌కు ప్ర‌భుత్వ కాంట్రాక్టుల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని గ‌ద్దెనెక్కిండు. ఈ రెండున్న‌రేండ్ల‌లో నాలుగు ల‌క్ష‌ల కోట్ల అప్పు చేసిండు. ఈ అప్పులో నాలుగ రూపాయాలైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్ట‌ర్లకు ఇచ్చావా..? శ్వేత ప‌త్రం విడుద‌ల చేసే ద‌మ్ముందా..? ఎన్నిక‌ల‌కు ముందు డిక్ల‌రేష‌న్ల వ‌ర‌ద‌.. ఇప్పుడేమో బూతుల వ‌ర‌ద పారుతోంది అని కేటీఆర్ మండిప‌డ్డారు.

రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంలో బీజేపీ ఎంపీల‌కు కూడా కాంట్రాక్టులు

చిన్న కాంట్రాక్ట‌ర్ల‌ను కాపాడండి అని నాడు కేసీఆర్ చెప్పారు. ఇవాళ కాంట్రాక్టులు రేవంత్ రెడ్డి బామ్మ‌ర్దికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి వ‌స్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోద‌రుల‌కు రావ‌డం లేదు. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంలో బీజేపీ ఎంపీల‌కు కూడా వ‌స్తున్నాయి. యంగ్ ఇండియా స్కూల్ కాంట్రాక్టు ఎంపీ విశ్వేశ్వ‌ర్ రెడ్డికి వ‌చ్చాయి. రోడ్ల టెండ‌ర్లు పిలిస్తే.. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ. 1300 కోట్ల టెండ‌ర్లు వ‌స్తాయి. కొడంగ‌ల్ నారాయ‌ణ‌పేట ఎత్తిపోత‌ల టెండ‌ర్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు ఇవ్వ‌డు.. కానీ పొంగులేటికి వ‌స్తాయ‌ని కేటీఆర్ తెలిపారు.

రేవంత్ రెడ్డి జీవో నంబ‌ర్ 17 తీసుకువ‌చ్చిండు

చిన్న కాంట్రాక్ట‌ర్ల‌ను రోడ్డు ప‌డేసేందుకు రేవంత్ రెడ్డి జీవో నంబ‌ర్ 17 తీసుకువ‌చ్చిండు. గురుకులాల్లో కూర‌గాయ‌లు, పాలు, చికెన్, బ్రెడ్ వంటి కాంట్రాక్టులు కింది స్థాయిలోనే జ‌రిగేవి. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జ‌ర‌గాల‌ట‌. లేకి మాట‌లు మాట్లాడుడు ఈజీ.. ముఖ్య‌మంత్రి అంటే అప్పుడ‌ప్పుడ‌న్న ప్ర‌జ‌ల‌కు ప‌నికి వ‌చ్చే మాట‌లు మాట్లాడాలి. కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రులు చేస్తాడ‌ట‌. మీ మెడ‌లో పుస్తెల తాడు ఎత్తుకోక‌పోతే వాడే మంచోడు. కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియ‌దు.. కోట్లు మింగుడు తెలుసు.. ఎన్ని సున్నాలు ఉంటాయో ఆయ‌న‌కు ఏం ఎరుక‌.. అలాంటి ముఖ్య‌మంత్రి మ‌నోడు అని కేటీఆర్ విమ‌ర్శించారు.

రెగ్యుల‌ర్ సీఎం కాదు.. రెన్యూవ‌ల్ సీఎం..

అధికారంలోకి రాగానే కాంట్రాక్ట‌ర్ల‌ను సృష్టిస్తా అన్నోడు రేవంత్.. అధికారంలోకి వ‌చ్చాక ఉన్నోళ్ల‌ను ఊడ‌గొడుతున్న‌డు. పైస‌లు పంపి కుర్చీ కాపాడుకుంటున్నాడు. రెగ్యుల‌ర్ సీఎం కాదు.. రెన్యూవ‌ల్ సీఎం. నెల‌కు నెల‌కు బ్యాగులు మోసుకుంటూ పోవాలి. కాబ‌ట్టి ఢిల్లీ పెద్ద‌ల‌ను అడ‌గాలి. రేవంత్ రెడ్డి క‌థ టెన్ జ‌న్‌ప‌థ్‌లో ఉంట‌ది. అవ‌స‌ర‌మైతే జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నా చేద్దాం. జీవో 17 ర‌ద్దు అయ్యే దాకా రేవంత్‌కు బుద్ది చెప్పేదాకా ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు కాంట్రాక్ట‌ర్లు వ‌చ్చేదాకా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను వ‌దిలిపెట్టొద్దు.. అధికారం ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు.. మంచి ప‌నులు చేస్తే ప్ర‌జ‌లు యాదికి పెట్టుకుంటారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

సెక్యూరిటీ లేకుండా వ‌స్తే తెలుస్త‌ది..

మా అయ్య పేరు చెప్పుకునే వ‌చ్చాను నేను. తెలంగాణ తెచ్చినోడు మా నాన్న మొగోడు మొన‌గాడు. మంచి ప‌నులు చేయ్.. నీ మాట నిల‌బెట్టుకో. రోడ్డు మీద‌కు సెక్యూరిటీ లేకుండా వ‌స్తే తెలుస్త‌ది. ఎన్నిక‌లు ఎప్పుడ వ‌స్తాయా.. కాంగ్రెస్‌ను బొంద పెడుదామా అని ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు. ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కూడా ధ‌ర్నా చేద్దాం. ప్ర‌భుత్వం దిగివ‌చ్చే దాకా వ‌దిలిపెట్టొద్దు.. భ‌విష్య‌త్‌లో 50 వేల మందిని కాంట్రాక్ట‌ర్లుగా త‌యారు చేసే బాధ్య‌త తీసుకుంటాన‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement