Bribes For Speed Darshan | ఆలయాల్లో వీఐపీ దర్శనం పేరుతో అడ్డగోలు వసూళ్లు.. మారువేషంలో వెళ్లి షాకిచ్చిన మంత్రి
Bribes For Speed Darshan | తమిళనాడులోని ఆలయాల్లో వీఐపీ సంస్కృతి (VIP Darshan) పెరిగిపోతోంది. ఆలయాల్లో పనిచేసే అర్చకులు, ఇతర సిబ్బంది వీఐపీ దర్శనాల పేరుతో భక్తులను దోచుకుంటున్నారు (Bribes For Speed Darshan).
Bribes For Speed Darshan | తమిళనాడులోని ఆలయాల్లో వీఐపీ సంస్కృతి (VIP Darshan) పెరిగిపోతోంది. ఆలయాల్లో పనిచేసే అర్చకులు, ఇతర సిబ్బంది వీఐపీ దర్శనాల పేరుతో భక్తులను దోచుకుంటున్నారు (Bribes For Speed Darshan). ఈ వ్యవహారంపై మద్రాసు హైకోర్టు ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆలయాల్లో వీఐపీ దర్శనాలు ఎందుకు..? అంటూ ప్రశ్నించింది. దేవుడి ముందు అంతా సమానమేనని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆలయాల్లో వీఐపీ సంస్కృతిపై తమిళనాడు మంత్రి రమేశ్ వాస్తవాలను తెలుసుకునేందుకు ఆయనే స్వయంగా సామాన్యుడిలా ఆలయానికి వెళ్లారు.
తూత్తుకుడి జిల్లాలో సముద్ర తీరాన ఉన్న తిరుచెందూరు మురుగన్ ఆలయానికి (Tiruchendur temple) ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. దీంతో నిత్యం ఆలయంలో రద్దీ ఉంటుంది. స్వామి దర్శనం కోసం క్యూలో వేచి ఉండాల్సి వస్తుంది. ఇదే ఆసరాగా వీఐపీ దర్శనాల పేరుతో ఆలయంలో పనిచేసే వారు సామాన్య ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన మంత్రి నేరుగా సామాన్యుడిలా గుడికి వెళ్లారు. ముఖానికి మాస్కు పెట్టుకుని ఎలాంటి హడావుడి లేకుండా ఆలయంలోకి వెళ్లారు.
ఆయన్ని చూసిన అక్కడి అర్చకులు వీఐపీ దర్శనం చేయిస్తామంటూ మంత్రి వద్ద రూ.4 వేలు వసూలు చేశారు. అర్చకుడికి ఆన్‌లైన్ ద్వారా మంత్రి డబ్బు పంపించారు. ఆ తర్వాత ముఖానికి ఉన్న మాస్క్ తీసి మంత్రి షాకిచ్చాడు. మంత్రిని చూసిన అర్చకుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, అధికారులు అర్చకుడిని, అతడికి సహకరించిన మరో సిబ్బందిని పట్టుకున్నారు. వారిని మంత్రి సస్పెండ్ చేశారు.
దేవుడి ముందు అంతా సమానమే..
ఇదిలా ఉండగా.. ఆలయాల్లో వీఐపీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంపై మద్రాసు హైకోర్టు (Madras HC) శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రముఖులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఏముంది..? అంటూ ప్రశ్నించింది. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాల్లో వీఐపీ, ప్రత్యేక దర్శన సౌకర్యాలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ వి. లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
దేవుడి ముందు భక్తులందరూ సమానమేనని స్పష్టం చేసింది. మంత్రులు, ఇతర ప్రముఖుల ప్రత్యేక దర్శనాల వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదని పేర్కొంది. "మంత్రులు, ఎమ్మెల్యేలు తాము ప్రత్యేకం అని భావించొద్దు. దేవుడు తమ కోసమే ఎదురుచూస్తుంటాడని అనుకోకూడదు. అసలు మనకు వీఐపీ దర్శనాలు ఎందుకు..? దేవుడి ముందు అందరూ సమానమే" అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే, క్యూ లైన్లలో రద్దీని తగ్గించడానికి ఇటువంటి పద్ధతిని అనుసరిస్తున్నామని, దీనివల్ల ఆలయాలకు గణనీయమైన ఆదాయం కూడా సమకూరుతోందని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పీవీ బాలసుబ్రమణియం కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. వీఐపీ సంస్కృతి, పెయిడ్ దర్శనాలపై సమాధానం చెప్పాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Also Read..
ఐటీ జాబ్ వదిలి ఆటో స్టీరింగ్ పట్టిన మహిళ.. నెలకు ఎంత సంపాదిస్తోందంటే..?
సంబంధిత వార్తలు

Annamalai | నేరగాళ్లకు స్వేచ్ఛ లభించింది.. సెలబ్రేషన్ మూడ్ నుంచి బయటకు రండి.. విజయ్‌పై అన్నామలై ధ్వజం
మే 26, 2026

Udhayanidhi Stalin | ఇక కాంగ్రెస్‌ను ఎప్పటికీ నమ్మొద్దు: ఉదయనిధి స్టాలిన్
మే 24, 2026

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026
తాజావార్తలు
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!
- ●Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు 'కారుణ్య మరణం' ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల

Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక



