Hardeep Singh Puri | ‘లాక్‌డౌన్’ వార్తలు అవాస్తవం.. స్పష్టతనిచ్చిన కేంద్ర మంత్రి
Hardeep Singh Puri | ఆరేండ్ల క్రితం కరోనా దేశాన్ని అతాలకుతలం చేసిన సంగతి తెలిసిందే. నెలల పాటు లాక్‌డౌన విధించిన విషయం తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంలో తాజాగా దేశంలో మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తుతుందా..? అన్న అనుమానాలు దేశ ప్రజల్లో నెలకొన్నాయి.
Hardeep Singh Puri | త్రినేత్ర.న్యూస్ : ఆరేండ్ల క్రితం కరోనా దేశాన్ని అతాలకుతలం చేసిన సంగతి తెలిసిందే. నెలల పాటు లాక్‌డౌన విధించిన విషయం తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంలో తాజాగా దేశంలో మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తుతుందా..? అన్న అనుమానాలు దేశ ప్రజల్లో నెలకొన్నాయి. ఎందుకంటే అక్కడి నుంచి దిగుమతి అయ్యే ఇంధన వనరులకు ఆటంకం ఏర్పడడమే. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురై ముందస్తు జాగ్రత్తగా గత రెండు రోజుల నుంచి పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. అంతేకాకుండా ఎల్పీజీ వంట గ్యాస్ కోసం ఆయా గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కట్టారు. ఇక ఇవాళ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దేశ ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని ప్రకటన వెలువడిన వెంటనే.. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా..? అనే అనుమానం ప్రజల్లో నెలకొంది.
ఈ క్రమంలో లాక్‌డౌన్‌పై వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఎక్స్ వేదికగా స్పందించారు. లాక్‌డౌన్ ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ఇంధనం, సరఫరా వ్యవస్థలు, నిత్యావసరాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని హర్దీప్ సింగ్ పురీ వెల్లడించారు.
ప్రజలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చాలా దేశాలు సరి - బేసి విధానాన్ని పాటిస్తున్నాయి. పని దినాలను నాలుగు రోజులకే కుదించారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. ఇంధన వనరులను 20 నుంచి 30 శాతానికి పెంచారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడా ప్రజలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
కమర్షియల్ ఎల్పీజీ కేటాయింపు 70 శాతానికి పెంపు..!
ఎల్పీజీ వంట గ్యాస్ ప్రజల అవసరాలకు సరిపడినంతా అందుబాటులో ఉంది. కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను సులభతరం చేసేందుకు మరో ముందడుగు వేశాం.. రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ కేటాయింపును 70 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. అయితే 20 శాతం కేటాయింపును స్టీల్, ఆటోమొబైల్, టెక్స్‌టైల్‌తో పాటు అధిక శ్రమతో కూడిన పరిశ్రమలకు కేటాయించాలని నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు.
మన దేశంలో మాత్రం ఇంధన ధరలను పెంచలేదు..
గత నెల రోజుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 70 డాలర్ల నుంచి 122 డాలర్ల వరకు వెళ్లొచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఉత్తర అమెరికాలో 30 శాతం, యూరప్‌లో 20 శాతం, ఆగ్నేసియా దేశాల్లో 30-50 శాతం, ఆఫ్రికా దేశాల్లో 50 శాతం మేర ఇంధన ధరలు పెరిగాయి. కానీ మన దేశంలో మాత్రం ఇంధన ధరలను పెంచలేదు. అంతేగాక చమురు కంపెనీల అధిక నష్టాలను తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకం తగ్గించుకున్నాం. విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనంపై ఎగుమతి పన్ను విధించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
The global situation remains in flux, and we are closely monitoring developments across energy, supply chains, and essential commodities on a real-time basis.
Under the leadership of Hon’ble PM @narendramodi Ji, all necessary steps are being taken to ensure uninterrupted…
— Hardeep Singh Puri (@HardeepSPuri) March 27, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






