త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tirumala Brahmotsavam | సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Tirumala Brahmotsavam | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్‌ 14న సాయంత్రం అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

P

Devotional | Published On Jul 31, 2026, 8.17 pm IST

Tirumala Brahmotsavam | సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
Advertisement

Tirumala Brahmotsavam | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్‌ 14న సాయంత్రం అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు. ఆయా రోజుల వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయి.

సెప్టెంబర్‌ 15: సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.
సెప్టెంబర్‌ 16: ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.
సెప్టెంబర్‌ 17: ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం.
సెప్టెంబర్‌ 18: ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం.
సెప్టెంబర్‌ 19: ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు గరుడ వాహన సేవ.
సెప్టెంబర్‌ 20: ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం.
సెప్టెంబర్‌ 21: ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం.
సెప్టెంబర్‌ 22: ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం.
సెప్టెంబర్‌ 23: ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, అనంతరం రాత్రి ధ్వజావరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Advertisement
Advertisement