UIIC Recruitment | యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో 225 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు..
UIIC Recruitment | ప్రభుత్వరంగ బీమా సంస్థ అయిన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (UIIC) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (Administrative Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుద లచేసింది. మొత్తం 225 ఖాళీలకు దరఖాస్తులు (UIIC Recruitment) ఆహ్వానిస్తున్నది.
UIIC Recruitment | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వరంగ బీమా సంస్థ అయిన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (UIIC) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (Administrative Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుద లచేసింది. మొత్తం 225 ఖాళీలకు దరఖాస్తులు (UIIC Recruitment) ఆహ్వానిస్తున్నది. దరఖాస్తులు సెప్టెంబర్ 28 వరకు అందుబాటులో ఉంటాయి. అర్హులైనవారు అధికారిక వెబ్‌సైట్ uiic.co.inలో దరఖాస్తు చేసుకోచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ప్రతినెల రూ.82,485 నుంచి రూ.1,56,745 వరకు జీతం అందుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 225
ఇందులో జనరలిస్ట్ 200 (జనరల్ 68, బీసీ 62, ఈడబ్ల్యూఎస్ 22, ఎస్సీ 30, ఎస్టీ 18, పీడబ్ల్యూడీ 11), హిందీ ఆఫీసర్ 25 (జనరల్11, బీసీ 7, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సీ 4, ఎస్టీ 1, పీడబ్ల్యూడీ 1) చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులవ్వాలి. హిందీ ఆఫీసర్ పోస్టులకు హిందీ, ఇంగ్లిష్‌లో పీజీ చేసి ఉండాలి. అభ్యర్థులు 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. ఆన్‌లైన్ రాతపరీక్ష రెండు దశల్లో ఉంటుంది.
ప్రిలిమినరీ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. ఇది తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలి.
- ఇంగ్లిష్ లాంగ్వేజీ నుంచి 30 ప్రశ్నలు, 30 మార్కులు
- రీజనింగ్ 35 ప్రశ్నలు, 35 మార్కులు
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలు, 35 మార్కులు
మెయిన్ ఎగ్జామ్ (జరనలిస్ట్‌లకు)- 250 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, ఫైనాన్షియల్ సెక్టార్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 200 ప్రశ్నలు అండుగుతారు. 150 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి. ఆ తర్వాత 30 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష (లెటర్ రైటింగ్) ఉంటుంది. 30 నిమిషాల్లో రాయాలి.
మెయిన్ ఎగ్జామ్ (హిందీ ఆఫీసర్)- 200 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, హింది-ఇంగ్లిష్‌లో ఫ్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. 120 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఆ తర్వాత 50 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది.
మెయిన్ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.250
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 8
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 28
హాల్‌టికెట్ డౌన్‌లోడ్: పరీక్షకు 7 రోజుల ముందు
ప్రిలిమినరీ పరీక్ష: 2026 అక్టోబర్ 22
మెయిన్ ఎగ్జామినేషన్: 2026 నవంబర్ 30
వెబ్‌సైట్: uiic.co.in
మరిన్ని వివరాలు..
సంబంధిత వార్తలు

RFCL | రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, MBA అభ్యర్థులకు అవకాశం
సెప్టెంబర్ 7, 2026

BGSSL Recruitment | బరోడా గ్లోబల్ సర్వీసెస్‌లో 1949 ఉద్యోగాలు..
సెప్టెంబర్ 6, 2026

Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాలు.. 1100 పోస్టులతో నోటిఫికేషన్
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●అసెంబ్లీ గడప తొక్కని కేసీఆర్... సభకు దూరంగా ఉండటం వెనుక 6 కారణాలు
- ●Harish Rao | అసెంబ్లీ వద్ద తోపులాట.. హరీశ్ రావు, కేటీఆర్‌పై కేసు
- ●Horoscope | సెప్టెంబర్ 8 రాశిఫలాలు.. కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొంత శ్రమ అవసరం!
- ●Global Summit | ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించండి.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష
- ●Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్
- ●TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు

అసెంబ్లీ గడప తొక్కని కేసీఆర్... సభకు దూరంగా ఉండటం వెనుక 6 కారణాలు

Harish Rao | అసెంబ్లీ వద్ద తోపులాట.. హరీశ్ రావు, కేటీఆర్‌పై కేసు

Horoscope | సెప్టెంబర్ 8 రాశిఫలాలు.. కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొంత శ్రమ అవసరం!

Global Summit | ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించండి.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష



