త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BGSSL Recruitment | బ‌రోడా గ్లోబ‌ల్ స‌ర్వీసెస్‌లో 1949 ఉద్యోగాలు..

BGSSL Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో అతిపెద్ద ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకుల్లో ఒక‌టైన‌ బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (BOB) త‌న అనుబంధ సంస్థ బ‌రోడా గ్లోబ‌ల్ షేర్డ్ స‌ర్వీసెస్ (BGSSL)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది.

G

National | Published On Sep 6, 2026, 6.34 am IST

BGSSL Recruitment | బ‌రోడా గ్లోబ‌ల్ స‌ర్వీసెస్‌లో 1949 ఉద్యోగాలు..
Advertisement

BGSSL Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో అతిపెద్ద ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకుల్లో ఒక‌టైన‌ బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (BOB) త‌న అనుబంధ సంస్థ బ‌రోడా గ్లోబ‌ల్ షేర్డ్ స‌ర్వీసెస్ (BGSSL)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 1,949 పోస్టుల‌తో నోటిఫికేష‌న్ (BGSSL Recruitment) విడుద‌ల చేసింది. ఇందులో అప్రెంటిస్ (Apprentice), టెలీక‌లెక్ష‌న్ ఏజెంట్‌, డిప్యూటీ మేనేజ‌ర్ హెచ్ఆర్‌, ప్రొక్యూర్ మేనేజ‌ర్‌, ఆధార్ ఆప‌రేట‌ర్, ఎగ్జిక్యూటివ్ (Executive) వంటి పోస్టులు ఉన్నాయి. అర్హ‌త, ఆస‌క్తి క‌లిగిన‌వారు సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో www.bgss.in ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎంపికైన‌వారు గాంధీన‌గ‌ర్‌, వ‌డోద‌ర‌, బెంగ‌ళూరు, ముంబై, దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లో ప‌నిచేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు: 1949
అప్రెంటిస్ (టెలీకాలింగ్‌) 150, డెబ్ట్ రిక‌వ‌రీ ఏజెంట్ 100, ఎగ్జిక్యూటివ్ 40, ట్రేడ్ ఫైనాన్స్ ఆప‌రేష‌న్స్ 25, సీఏఎస్ఏ/ఎఫ్‌సీఎన్ఆర్‌/కాలింగ్ 40, ప్రొక్యూర్‌మెంట్ మేనేజ‌ర్ 1, ఎంఐఎస్ అన‌లిస్ట్ 3, డిప్యూటీ మేనేజ‌ర్ 1, ఎగ్జిక్యూటివ్ /సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్స్ 20, డెస్క్‌టాప్ స‌పోర్ట్ అన‌లిస్ట్ 1, డైల‌ర్ 1, టెలీక‌లెక్ష‌న్ 6, డిప్యూటీ మేనేజ‌ర్ 1, డెబిట్ కార్డ్ ఆప‌రేష‌న్స్ 10, ఫీల్డ్ క‌లెక్ష‌న్ ఆఫీస‌ర్ 400, డిజిట‌ల్ ఆన్‌బోర్డింగ్ స్పెష‌లిస్ట్ 400, సేల్స్ ఆఫీస‌ర్ 350, ఆధార్ ఆప‌రేట‌ర్ 400 చొప్పున కాలీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి.
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో. recruitment@bgss.inకు రెజ్యూమ్‌ను ఈ-మెయిల్ కూడా చేయ‌వ‌చ్చు.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: సెప్టెంబ‌ర్ 30
వెబ్‌సైట్‌: www.bgss.in/careers

Advertisement
Advertisement