త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | బీజేపీయే దుకాణాలను బలవంతంగా మూయించింది.. వ్యాపారుల ఆందోళ‌న‌పై రాహుల్ గాంధీ కౌంట‌ర్‌

Rahul Gandhi | నిర‌స‌న‌ల్లో పాల్గొనే వారు ఎలాంటి వ‌స్తువులూ కొనుగోలు చేయ‌కుండా క‌న్నాట్ ప్లేస్‌లో దుకాణాల‌ను బీజేపీయే బ‌ల‌వంతంగా మూయించింద‌ని ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

D

National | Published On Nov 1, 2026, 2.21 pm IST

Rahul Gandhi | బీజేపీయే దుకాణాలను బలవంతంగా మూయించింది.. వ్యాపారుల ఆందోళ‌న‌పై రాహుల్ గాంధీ కౌంట‌ర్‌
Advertisement

Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : స‌ర్‌, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష ఇండీ కూట‌మి నిర్వ‌హించ త‌ల‌పెట్టిన భారీ ర్యాలీ కార‌ణంగా ఢిల్లీలో వ్యాపారుల‌కు జరుగుతున్న నష్టాలపై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం మ‌రింత ముదిరింది. పండుగ సీజ‌న్‌లో రాహుల్ గాంధీ స్థానిక వ్యాపారుల‌కు న‌ష్టం క‌లిగిస్తున్నార‌ని బీజేపీ నేత‌లు ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో క‌మ‌లం పార్టీ ఆరోప‌ణ‌ల‌కు ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ కౌంట‌ర్ ఇచ్చారు. వ్యాపారుల ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను బీజేపీయే దెబ్బ‌తీస్తోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఢిల్లీలో మెగా ర్యాలీ వేళ రాహుల్ ఓ వీడియోని విడుద‌ల చేశారు. నిర‌స‌న‌ల్లో పాల్గొనేందుకు వ‌చ్చే వారు స్థానిక వ్యాపారుల‌కు అండ‌గా నిల‌వాల‌ని త‌మ మ‌ద్ద‌తుదారుల‌కు సూచించిన‌ట్లు రాహుల్ చెప్పారు. నిర‌స‌న‌లు, ప్ర‌ద‌ర్శ‌న‌లు, ర్యాలీలో పాల్గొన‌డంతోపాటూ దీపావ‌ళి, ఛ‌త్‌పూజ‌, దంతేరాస్ పండుగ‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీకి వ‌స్తున్న నిర‌స‌న‌కారులు స్థానిక వ్యాపారుల వ‌ద్ద షాపింగ్ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశామ‌న్నారు. అయితే క‌న్నాట్ ప్లేస్‌కు వ‌స్తున్న స‌మ‌యంలో త‌న‌కు ఓ విష‌యం తెలిసింద‌న్నారు. నిరసనలో పాల్గొనేవారు ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయకుండా ఇక్క‌డ దుకాణాల‌ను బీజేపీనే బ‌ల‌వంతంగా మూయించింద‌ని ఆరోపించారు. ఢిల్లీలో వ్యాపారాల‌కు ఎవరు నష్టం కలిగిస్తున్నారో తెలుసుకోవాలని వ్యాపారుల‌కు రాహుల్‌ సూచించారు.

Also Read..

ఇండీ కూట‌మి మెగా మార్చ్.. ఓపెన్ టాప్ వాహ‌నంలో ప్ర‌యాణించిన‌ నేత‌లు

సైబరాబాద్ ప‌రిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 205 మందిపై కేసులు న‌మోదు

సంక్రాంతి రేసులో అక్కినేని కోడ‌లి త‌మిళ మూవీ - టాలీవుడ్ హీరోల‌తో పోటీ...

ట్యాగ్స్:

BJPChalo DelhiCongressConnaught PlaceConnaught Place JunctionDelhiINDIA Bloc MarchRahul GandhiRamlila MaidanShut Down Shops In Connaught Place
Advertisement
Advertisement