త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Helicopters Collide In Nepal | రెండు హెలికాప్ట‌ర్లు ఢీ.. భార‌తీయుడు మృతి

Helicopters Collide In Nepal | నేపాల్ (Nepal)లోని మౌంట్ ఎవ‌రెస్ట్ (Mount Everest) స‌మీపంలో రెండు హెలికాప్ట‌ర్లు ప‌రస్ప‌రం ఢీ కొన్నాయి (Helicopters Collide In Nepal). ఈ ప్ర‌మాదంలో భార‌తీయుడు ప్రాణాలు కోల్పోయాడు.

D

National | Published On Nov 3, 2026, 11.24 am IST

Helicopters Collide In Nepal | రెండు హెలికాప్ట‌ర్లు ఢీ.. భార‌తీయుడు మృతి
Advertisement

Helicopters Collide In Nepal | త్రినేత్ర న్యూస్ : నేపాల్ (Nepal)లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌పంచంలోనే అతి ఎత్తైన మౌంట్ ఎవ‌రెస్ట్ (Mount Everest) స‌మీపంలో రెండు హెలికాప్ట‌ర్లు ప‌రస్ప‌రం ఢీ కొన్నాయి (Helicopters Collide In Nepal). ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. మృతుడు భార‌త పౌరుడు వసంత్ కుమార్ బలరాముడుగా గుర్తించిన‌ట్లు కాఠ్మాండూ పోస్ట్ నివేదించింది.

రాజ‌ధాని కాఠ్మాండూ (Kathmandu)కు 250 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న సోలుఖుంబులోని (Solukhumbu) ఓ హెలిప్యాడ్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రెండు హెలికాప్ట‌ర్లు ఒకేసారి ల్యాండింగ్ ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో హెలికాప్ట‌ర్ల రెక్క‌లు ఒక‌దానికొక‌టి ఢీకొన‌డంతో అవి అనూహ్యంగా నేల‌పై కూలిపోయాయి. అదే స‌మ‌యంలో అక్క‌డ చాలా మంది ప‌ర్యాట‌కులు ఉన్నారు. హెలికాప్ట‌ర్లు నేల‌కూలుతుండ‌టంతో ప్రాణభ‌యంతో వారంతా ప‌రుగులు తీశారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఘ‌ట‌న‌లో ఓ వ్య‌క్తి గాయ‌ప‌డ‌గా.. అత‌డిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు స్థానిక అధికారులు వెల్ల‌డించారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

ప్రమాదం జరిగిన ప్రాంతం ఎవరెస్ట్‌ పర్వతారోహణ మార్గంలో కీలకమైనదిగా స్థానిక మీడియా నివేదించింది. ఇక్కడ పర్యాటకులు, పర్వతారోహకులు, సామాగ్రి రవాణాకు హెలికాప్టర్లను విస్తృతంగా వినియోగిస్తుంటారు. అయితే, అక్క‌డి భౌగోళిక పరిస్థితులు, వేగంగా మారుతున్న వాతావరణ ప‌రిస్థితులు ప్రపంచంలోనే అత్యంత సవాలుతో కూడుకున్నవి. అందుకే ఇక్క‌డ విమాన‌యాన కార్య‌క‌లాపాలు అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారుతుంటాయి.

Also Read..

పిల్లల భవిష్యత్తు కోసం రూ.30 లక్షలు.. ఎల్ఐసీ పాలసీలతో సాధ్య‌మేనా..?

స్టాక్ మార్కెట్లలో జోరు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..

Dhanteras 2026 | ధన్‌తేరస్‌కు బంగారం కొంటున్నారా? ఈ ఐదు విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

ట్యాగ్స్:

Helicopters Collide In NepalHimalayan NationKathmanduMount EverestNepalSolukhumbu
Advertisement
Advertisement