Tulip Garden | 18 లక్షల మొక్కలతో కనువిందు చేస్తున్న తులిప్ గార్డెన్
ఈ తోటను కశ్మీర్ లోయలో పర్యాటకాన్ని పెంపొందించడం కోసం 2007 లో ప్రారంభించారు. దీన్ని అప్పట్లో మోడల్ ఫ్లోరికల్చర్ సెంటర్ అని కూడా పిలిచేవారు. తులిప్ గార్డెన్ ప్రవేశ రుసుము పెద్దలకు రూ.75 నుంచి రూ.100 వరకు ఉంటుంది. పిల్లలకు రూ.50, విదేశీ పర్యాటకులకు రూ.200 ఉంటుంది.
Tulip Garden | త్రినేత్ర.న్యూస్ : ఆసియాలోనే అతిపెద్దదైన శ్రీనగర్‌లోని ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ వీక్షకులకు కనువిందు చేస్తోంది. సందర్శకుల కోసం ఈ గార్డెన్‌ను జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మార్చి 16న ప్రారంభించారు. సందర్శకులకు ఆన్‌లైన్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 70 రకాలకు చెందిన 18 లక్షల మొక్కలను నాటారు. ఇతర రకాలకు చెందిన లక్ష మొక్కలను సైతం నాటారు. తొలిరోజే తోట అందాలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు, స్థానికులు తరలివచ్చారు.
దాల్ సరస్సు పక్కనే
ఆసియాలోనే అతి పెద్ద తులిప్ తోట ఇది. జమ్ముకశ్మీర్‌లో ఉన్న దాల్ సరస్సుకు సమీపంలో జబర్వాన్ పర్వత శ్రేణుల కింద ఈ తోట ఉంటుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒక నెల పాటు మాత్రమే సందర్శకులకు ఈ తోట అందుబాటులో ఉంటుంది. రంగు రంగుల వరుసలలో రకరకాల తులిప్ పువ్వులు సందర్శకులను ఆకట్టుకుంటాయి.
2007 లో ప్రారంభం
ఈ తోటను కశ్మీర్ లోయలో పర్యాటకాన్ని పెంపొందించడం కోసం 2007 లో ప్రారంభించారు. దీన్ని అప్పట్లో మోడల్ ఫ్లోరికల్చర్ సెంటర్ అని కూడా పిలిచేవారు. తులిప్ గార్డెన్ ప్రవేశ రుసుము పెద్దలకు రూ.75 నుంచి రూ.100 వరకు ఉంటుంది. పిల్లలకు రూ.50, విదేశీ పర్యాటకులకు రూ.200 ఉంటుంది.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vakiti Srihari | శ్రీనగర్‌లో ఖేలో ఇండియా చింతన్ శిబిర్.. పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి
ఏప్రిల్ 25, 2026

Pahalgam terror attack | పహల్గామ్ దాడికి ఏడాది.. ఆ రోజు ఏం జరిగిందంటే..?
ఏప్రిల్ 22, 2026

Tricolour Ribbon | ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి మువ్వన్నెల రిబ్బన్.. కట్‌చేసేది లేదన్న సీఎం..
ఏప్రిల్ 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



