త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vakiti Srihari | శ్రీన‌గ‌ర్‌లో ఖేలో ఇండియా చింత‌న్ శిబిర్‌.. పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహ‌రి

Vakiti Srihari | జ‌మ్ముక‌శ్మీర్ రాజ‌ధాని శ్రీన‌గ‌ర్‌లో జ‌రుగుతున్న ఖేలో ఇండియా చింత‌న్ శిబిర్‌లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహ‌రి (Vakiti Srihari) నేతృత్వంలోని బృందం పాల్గొన్న‌ది.

G

Telangana | Published On Apr 25, 2026, 10.34 am IST

Vakiti Srihari | శ్రీన‌గ‌ర్‌లో ఖేలో ఇండియా చింత‌న్ శిబిర్‌.. పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహ‌రి
Advertisement

Vakiti Srihari | త్రినేత్ర‌.న్యూస్‌: జ‌మ్ముక‌శ్మీర్ రాజ‌ధాని శ్రీన‌గ‌ర్‌లో జ‌రుగుతున్న ఖేలో ఇండియా చింత‌న్ శిబిర్‌లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహ‌రి (Vakiti Srihari) నేతృత్వంలోని బృందం పాల్గొన్న‌ది. శ్రీనగర్‌లోని షేర్-ఇ-కాశ్మీర్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు జరిగ‌నున్న ఈ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రుల చింతన్ శిబిర్‌లో క్రీడల అభివృద్ధి, కేంద్ర, రాష్ట్రాల సమన్వయం, క్రీడలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో అమల‌వుతున్న ప్రత్యేక క్రీడా పాలసీ, క్రీడల్లో తెలంగాణను ఒక మోడల్‌గా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తున్న కార్యాచరణను మంత్రి వాకిటి శ్రీహరి వివరించనున్నారు. క్రీడా రంగానికి కావాల్సిన అవసరాలపై కేంద్ర సహకారాన్ని కోరనున్నారు. కాగా, శ‌నివారం ఉద‌యం చింతన్‌ శిబిర్ కార్య‌క్ర‌మంలో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు, కోచ్‌లు, క్రీడాకారులు, అధికారులు యోగాలో పాల్గొన్నారు. అనంత‌రం మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. తీరిక లేని దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా చేయాల‌న్నారు. యోగాతో మానసిక ప్రశాంతతతోపాటు, శారీర‌క పరిపుష్టిని సాధించ‌వచ్చ‌ని తెలిపారు. పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు యోగా చేయడం ఒక బాధ్యతగా అలవరుచుకోవాల‌ని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి మ‌న్సుక్ మాండ‌వీడయ‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఏపీ జితేందర్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనా రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ సోనిబాలదేవి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement