Anil Kumar Singhal | కల్తీ లడ్డూ వ్యవహారం.. టీటీడీ ఈవో అనిల్ సింఘాల్‌పై బదిలీ వేటు
Anil Kumar Singhal | తిరుమల కల్తీ లడ్డు (Tirumala Laddu) వ్యవహారంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. తిరుపతి దేవస్థానం ఈవో (TTD EO) అనిల్ కుమార్ సింఘాల్‌పై (Anil Kumar Singhal) ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.
- జీఏడీలో రిపోర్టు చేయాలంటూ ఆదేశం
- ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు
Anil Kumar Singhal | త్రినేత్ర.న్యూస్: తిరుమల కల్తీ లడ్డు (Tirumala Laddu) వ్యవహారంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. తిరుపతి దేవస్థానం ఈవో (TTD EO) అనిల్ కుమార్ సింఘాల్‌పై (Anil Kumar Singhal) ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. సింఘాల్‌పై బదిలీ వేటు వేసిన చంద్రబాబు సర్కార్, ఆయన స్థానంలో సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని సింఘాల్‌కు స్పష్టం చేసింది.
1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సింఘాల్ 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4 వరకు టీటీడీ ఈవోగా పని చేశారు. అనంతరం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ఈఓగా మరోసారి అవకాశం కల్పించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఆయన టీటీడీ ఈవోగా కొనసాగుతున్నారు.
కల్తీ నెయ్యి బాధ్యుడిగా..
అయితే టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో బాధ్యుడిని చేస్తూ సింఘాల్‌పై టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. సింఘాల్‌తోపాటు అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ ఎకౌంట్స్ ఆఫీసర్ (ఎఫ్‌ఏ అండ్ సీఓ) బాలాజీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇటీవల సిట్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






