త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Travels Bus | ట్రావెల్స్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ప్ర‌యాణికుల్లో ఎమ్మెల్యే

Travels Bus | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఓ ట్రావెల్స్‌ బస్సులో (Travels Bus) అగ్ని ప్రమాదం జ‌రిగింది. భువనేశ్వర్‌ నుంచి మల్కాన్‌గిరి వెళ్తున్న బస్సులో విజ‌య‌న‌గ‌రం (Vizianagaram) జిల్లాలోని రామభద్రపురం మండలం తారాపురం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

G

National | Published On Mar 21, 2026, 10.44 am IST

Travels Bus | ట్రావెల్స్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ప్ర‌యాణికుల్లో ఎమ్మెల్యే
Advertisement

Travels Bus | త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఓ ట్రావెల్స్‌ బస్సులో (Travels Bus) అగ్ని ప్రమాదం జ‌రిగింది. భువనేశ్వర్‌ నుంచి మల్కాన్‌గిరి వెళ్తున్న బస్సులో విజ‌య‌న‌గ‌రం (Vizianagaram) జిల్లాలోని రామభద్రపురం మండలం తారాపురం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్‌.. ప్రయాణికులను దించివేశారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో ఒడిశా చిత్ర‌కొండలోని ఎమ్మెల్యే మంగు ఖిల్లా కూడా ఉన్నట్లు సమాచారం. బస్సు వెనక టైర్‌ పేలడం వ‌ల్లే ప్రమాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తున్న‌ది. స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాద‌ స్థ‌లానికి చేరుకుని సహాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ ఘ‌న‌ట‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మ‌రోవైపు వరంగల్ జిల్లా దుగ్గొండి మం. వెంకటాపురంలో మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు.
5 రోజుల క్రితం తాళ్ల స‌తీశ్ (45) అనే వ్య‌క్తి ట్రాక్టర్‌ ఢీకొని తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ద‌వాఖాన‌లో చికిత్స పొందుతూ శుక్ర‌వారం రాత్రి మృతి చెందారు. స‌తీశ్ మృతికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ.. ట్రాక్టర్ యాజమాని జైపాల్‌రెడ్డి ఇంటి ముందు మృతదేహంతో బంధువుల ఆందోళన నిర్వ‌హిస్తున్నారు. కాగా, ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ సంజీవ్ ఇప్ప‌టికే పోలీసుల అదుపులో ఉన్నారు. అత‌నిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement