India-US Trade Deal | అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఖరారు.. అదనపు 25శాతం సుంకాలూ ఎత్తివేత
India-US Trade Deal | భారత్, అమెరికా మధ్య వాణిజ్య (India-US Trade Deal) సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ ఇరు దేశాల మధ్య కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. తాజా ఒప్పందం నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు (Russian Oil Imports) కారణం చూపి భారత వస్తువులపై విధించిన 25 శాతం సుంకాన్ని కూడా యూఎస్ తొలగించింది (Trump Lifts 25Percent Tariff On India).
India-US Trade Deal | భారత్, అమెరికా మధ్య వాణిజ్య (India-US Trade Deal) సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ ఇరు దేశాలు కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. భారతీయ వస్తువులపై 50 శాతం ఉన్న సుంకాన్ని (tariffs) 18 శాతానికి తగ్గించినట్లు అమెరికా ప్రకటించింది.
అదనపు సుంకాలు తొలగింపు..
అంతేకాదు, తాజా ఒప్పందం నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు (Russian Oil Imports) కారణం చూపి భారత వస్తువులపై విధించిన 25 శాతం సుంకాన్ని కూడా యూఎస్ తొలగించింది (Trump Lifts 25Percent Tariff On India). అదేవిధంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించినట్లు అమెరికా తెలిపింది. తమ దేశం నుంచి భారీగా ఇంధనం, గ్యాస్‌ను దిగుమతి చేసుకునేందుకు ఇండియా ఓకే చెప్పినట్లు వెల్లడించింది.
500 బిలియన్ డాలర్ల కొనుగోళ్లు..
ఈ ఒప్పందంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే..? రాబోయే ఐదేళ్లలో భారత్ అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయనుంది. ఇందులో ఇంధనం, విమానాలు, వాటి విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు వంటివి ఉంటాయి.
సుంకాలు పూర్తిగా తొలగింపు..
ఈ మధ్యంతర ఒప్పందం పూర్తిస్థాయిలో అమలైతే భారత జనరిక్ మందులు, వజ్రాలు, విమాన భాగాలపై ఉన్న సుంకాలను అమెరికా ఎత్తివేయనుంది. పూర్తిస్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కోసం చర్చలు కొనసాగిస్తామని, భవిష్యత్తులో మరిన్ని సుంకాల తగ్గింపును పరిశీలిస్తామని ఇరు దేశాలు ప్రకటించాయి.
18% సుంకం వర్తించే వస్తువులు..
హస్తకళా ఉత్పత్తులు, కొన్ని యంత్రాలు, హోమ్ డెకర్, లెదర్, పాదరక్షలు, ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్, రబ్బర్, టెక్స్‌టైల్స్, దుస్తులు.
అమెరికా వస్తువులపై టారిఫ్ తగ్గింపు..
ఇక ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికాకు చెందిన కొన్ని పారిశ్రామిక వస్తువులు, పండ్లు, సోయాబీన్ నూనె, వైన్ స్పిరిట్స్‌తో సహా పలు వ్యవసాయ, ఆహార ఉత్పత్తులపై సుంకాలను భారత్ తొలగించడమో లేక తగ్గించడమో చేస్తుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






