Tamil Nadu | డీఎంకే-కాంగ్రెస్ మధ్య తేలని సీట్ల పంచాయితీ..! నేటితో చర్చల ముగియనున్న గడువు..!
Tamil Nadu | తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ పదవీకాలం మేలో ముగియనున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నది. పార్టీలు పొత్తులపై కసరత్తు చేస్తున్నాయి. అధికార డీఎంకే-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలు ఇంకా తేలలేదు.
Tamil Nadu | తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ పదవీకాలం మేలో ముగియనున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నది. పార్టీలు పొత్తులపై కసరత్తు చేస్తున్నాయి. అధికార డీఎంకే-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలు ఇంకా తేలలేదు. రెండు పార్టీల మధ్య సీట్ల పంపిణీకి సంబంధించిన చర్చల గడువు మంగళవారంతోనే ముగియనున్నది. ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం జరుగలేదు. దాంతో డీఎంకే-కాంగ్రెస్ కూటమి భవిష్యత్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కూటమి కొనసాగేనా?
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. డీఎంకే నాయకత్వం కాంగ్రెస్ పార్టీని నిర్దిష్ట కాలపరిమితిలోగా వైఖరిని స్పష్టం చేయాలని కోరింది. రాబోయే ఎన్నికలకు వీలైనంత త్వరగా పొత్తులను ఖరారు చేసి, ప్రచారానికి సన్నహాలు చేయాలని డీఎంకే భావిస్తోంది. అయితే, పొత్తులకు కాలపరిమితి విధించగా ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో అనిశ్చితి కొనసాగుతుంది. ఈ క్రమంలో రెండు మిత్రపక్షాలు కలిసే పోటీ చేస్తాయా? లేదంటే కాంగ్రెస్‌ను డీఎంకే పక్కన పెడుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాంగ్రెస్ డిమాండ్లు..
2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్‌కు 25 ఈట్లు కేటాయించారు. ఈ సారి కూడా రాబోయే ఎన్నికల్లో అదే ఫార్ములాను కొనసాగించాలని స్టాలిన్ పార్టీ భావిస్తోంది. మళ్లీ కాంగ్రెస్‌కు 25 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని డీఎంకే ఆలోచిస్తున్నట్లుగా పలు నివేదికలు తెలిపాయి. అదనంగా కాంగ్రెస్‌కు ఓ రాజ్యసభ సీటును ఇచ్చేందుకు అవగాహనలో భాగంగా డీఎంకే అంగీకరించింది. అయితే, ఈ సారి కాంగ్రెస్ పార్టీ కనీసం 35 సీట్లను డిమాండ్ చేస్తోంది. సంస్థాగత ఉనికి, ఎన్నికల్లో పనితీరు దృష్ట్యా మరిన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. కొత్త పార్టీల ప్రభావం నేపథ్యంలో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది.
కష్టమేనంటున్న డీఎంకే..
అయితే, కూటమిలో కొత్త పార్టీలు చేరడంతో కాంగ్రెస్‌కు సీట్లను పెంచడం కష్టమని డీఎంకే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అనేక మిత్ర పార్టీలు తమకు సీట్లు పెంచాలని కోరుతున్నాయి. అయితే, డీఎంకే సీట్ల కేటాయింపును వ్యూహాత్మకంగా అమలు చేస్తోంది. ఆయా పార్టీల బలాబలాలను దృష్టిలో పెట్టుకొని సీట్లను సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ 35 సీట్లు డిమాండ్ చేస్తోంది. పొత్తులపై రాజీ కుదురుతుందా? అన్న చర్చ జరుగుతోంది. 234 అసెంబ్లీ సీట్లు ఉన్న తమిళనాడులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రొగ్రెసివ్ సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ సుమారు 158 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేయగా.. 17 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకాల విషయంలో సోనియా గాంధీ, ఏసీసీఐ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఉన్నత స్థాయి సంప్రదింపుల తర్వాత మళ్లీ సీట్లపై చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Read Also :
PM Modi | సోషల్ మీడియాలో ప్రధాని మోదీ మరో రికార్డు
Sonia Gandhi | ఇదేనా మీ విదేశాంగ విధానం..? కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సోనియా గాంధీ
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026

Murder Case | వరంగల్‌లో జంట హత్యల కేసు: నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు..!
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



