Jahangir Khan | పోటీ నుంచి తప్పుకున్నా ఫోర్త్ ప్లేస్‌లో ఉంచారు.. ఫల్తా రీపోలింగ్‌లో పుష్పకు 7 వేల ఓట్లు
Jahangir Khan | త్రినేత్ర.న్యూస్: పశ్చిమబెంగాల్‌లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గం రీపోలింగ్‌లో (Falta Assembly Repoll) బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దేవాంగ్షు పాండా తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి శంభు నాథ్ కుర్మీపై లక్షకు పైగా (1,09,021) ఓట్ల తేడాతో గెలిచారు.
Jahangir Khan | త్రినేత్ర.న్యూస్: పశ్చిమబెంగాల్‌లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గం రీపోలింగ్‌లో (Falta Assembly Repoll) బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దేవాంగ్షు పాండా తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి శంభు నాథ్ కుర్మీపై లక్షకు పైగా (1,09,021) ఓట్ల తేడాతో గెలిచారు. ఫల్తా స్థానానికి గురువారం (మే 21) రీపోలింగ్ జరుగగా, ఆదివారం ఫలితాలు ప్రకటించారు. అయితే ఈ ఎన్నికలో పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ టీఎంసీ (TMC) అభ్యర్థి జహంగీర్ ఖాన్‌కు (Jahangir Khan) 7 వేలకుపైగా ఓట్లు రావడం గమనార్హం. మొత్తం 7,783 ఓట్లతో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు.
తనను తాను ‘పుష్ప’గా (Pushpa) చెప్పుకున్న జహంగీర్ ఖాన్ రీపోలింగ్‌కు రెండు రోజుల ముందే అంటే ఈ నెల 19న పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌లా జహంగీర్ ఖాన్ తనను తాను పోల్చుకునేవారు. అందుకే ఆయనను అంతా ‘పుష్ప’ అని పిలుస్తుంటారు. సినిమాలో పుష్ప క్యారెక్టర్ లాగే తానూ ఎవరి ఒత్తిడికీ తలొగ్గేది లేదని ప్రకటించిన జహంగీర్ ఖాన్.. చివరకు పోటీ నుంచి తప్పుకోవడం విశేషం. ఆయన టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడు.
రీపోలింగ్ ఎందుకు?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 29న ఫల్టా నియోజకవర్గంలో కూడా పోలింగ్ జరిగింది. అయితే ఓటింగ్ యంత్రాల్లో జోక్యం జరిగిందన్న ఆరోపణలు, ఎన్నికల అక్రమాల ఫిర్యాదులు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఎన్నికను రద్దు చేసింది. నియోజకవర్గంలోని మొత్తం 285 బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత గురువారం (మే 21న) జరిగిన రీపోలింగ్‌లో మొత్తం 2.36 లక్షల ఓటర్లలో 87 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది.

పుష్ప ఓట్లు ఎలా?
టీఎంసీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో ఫల్తా ఒకటి. జహంగీర్ ఖాన్‌ను తన అభ్యర్థిగా పార్టీ బరిలో నిలిపింది. అయితే రీపోలింగ్‌కు రెండు రోజుల ముందు మే 19న తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పుష్ప ప్రకటించారు. అయితే అప్పటికే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో.. ఆయన పేరు, పార్టీ గుర్తును ఈవీఎంలలో ముద్రించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు 7,783 ఓట్లు పోలయ్యాయి.
బీజేపీ అభ్యర్థి దేవాంగ్షు పాండాకు 1,49,666 ఓట్లు, సీపీఎం క్యాండిడేట్ శంభు నాథ్ కుర్మీకి 40,645 ఓట్లు, కాంగ్రెస్‌కు చెందిన అబ్దుర్ రజాక్ మోల్లాకు 10,084 ఓట్లు వచ్చాయి.
సంబంధిత వార్తలు

Free Bus for Women | ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. జూన్ 1 నుంచి బెంగాల్లో అమల్లోకి..
మే 24, 2026

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

R. G. Kar Medical College | సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి.. ఆర్జీకర్ కేసులో బిగుస్తున్న ఉచ్చు
మే 19, 2026
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు



