త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Free Bus for Women | ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం.. జూన్ 1 నుంచి బెంగాల్‌లో అమ‌ల్లోకి..

Free Bus for Women | మ‌రో రాష్ట్రంలోనూ మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం (Free Bus for Women) అందుబాటులోకి రానుంది. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు, ఢిల్లీ, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ ప‌థ‌కం అమ‌ల్లో ఉండ‌గా, తాజాగా ప‌శ్చిమ బెంగాల్ (West Bengal) కూడా ఈ జాబితాలో చేర‌నుంది.

G

National | Published On May 24, 2026, 10.22 am IST

Free Bus for Women | ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం.. జూన్ 1 నుంచి బెంగాల్‌లో అమ‌ల్లోకి..
Advertisement

Free Bus for Women | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌రో రాష్ట్రంలోనూ మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం (Free Bus for Women) అందుబాటులోకి రానుంది. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు, ఢిల్లీ, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ ప‌థ‌కం అమ‌ల్లో ఉండ‌గా, తాజాగా ప‌శ్చిమ బెంగాల్ (West Bengal) కూడా ఈ జాబితాలో చేర‌నుంది. జూన్ 1న రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌ల‌కు ఉతిచ బ‌స్సు ప్ర‌యాణం అమ‌లు చేయ‌నుంది. అన్ని రాకాల ఆర్టీసీ బ‌స్సుల్లో (RTC Buses) బెంగాల్ మ‌హిళ‌లు ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. షార్ట్ రూట్‌, లాంగ్ రూట్ అని తేడా లేకుండా బెంగాల్ అంత‌టా ఉచిత ప్ర‌యాణం చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది. మహిళా సాధికారత, ప్రజా రవాణాను మరింత చేరువ చేయడంలో భాగంగా ఈమేర‌కు నిర్ణయం తీసుకుంది.

డిజిట‌ల్ కార్డు..

ఉచిత ప్ర‌యాణం ప‌థ‌కాన్ని ప‌క్కాగా అమ‌లు చేసేందుకు డిజిటల్ స్మార్ట్ కార్డులను (Digital Smart Cards) ప్ర‌భుత్వం జారీచేయ‌నుంది. దీనిపై ప్ర‌భుత్వం ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు చేస్తున్న‌ది. ఈ స్మార్ట్ కార్డుల్లో క్యూఆర్ కోడ్, ఫొటో, లబ్ధిదారుల వివరాలు ఉంటాయి. మహిళలు తమ సంబంధిత బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసుల్లో ఈ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆధార్ఓ
టర్ ఐడీ
పాన్ కార్డు
పాస్‌పోర్ట్‌
డ్రైవింగ్ లైసెన్స్
ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు
వీబీ జీ రామ్‌జీ జాబ్ కార్డు (గ్రామీణ‌ రోజ్‌గార్ గ్యారంటీ కార్డ్‌)
ఫొటోతో కూడిన పెన్ష‌న్ డాక్యుమెంట్‌
స‌ర్వీస్ ఐడెంటిటీ కార్డ్‌
స్కూల్, కాలేజీ, యూనివ‌ర్సిటీ జారీచేసే ఐడీ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలు తప్పనిసరి. వాటికి ఫొటోలను జత చేయాలి.

స్మార్ట్ కార్డులు వచ్చే వరకు, మహిళలు చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ఫోటో ఐడీ అంటే ఆధార్ వంటివి చూపించి ఉచిత ప్రయాణం పొందవచ్చని నోటిఫికేష‌న్‌లో పేర్కొంది. బస్సుల్లో కండక్టర్లు జీరో వాల్యూ టికెట్‌ లేదా థర్మల్ పేపర్ టికెట్లను జారీ చేస్తార‌ని వెల్ల‌డించింది.

Advertisement
Advertisement