త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Selfie | సెల్ఫీ మోజు.. జ‌ల‌పాతంలో ప‌డి ముగ్గురు అమ్మాయిలు మృతి

Selfie | ఇటీవ‌లి కాలంలో సెల్ఫీ అనేది ఫ్యాష‌న్ అయిపోయింది. సెల్ఫీలు దిగేందుకు యువ‌తీయువ‌కులు తెగ ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ సెల్ఫీల వ‌ల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు ఉన్నాయి. తాజాగా సెల్ఫీ మోజులో ప‌డి ఓ ముగ్గురు యువ‌తులు ప్రాణాల‌ను పోగొట్టుకున్నారు.

S

National | Published On Apr 9, 2026, 4.39 pm IST

Selfie | సెల్ఫీ మోజు.. జ‌ల‌పాతంలో ప‌డి ముగ్గురు అమ్మాయిలు మృతి
Advertisement

Selfie | త్రినేత్ర‌.న్యూస్ : ఇటీవ‌లి కాలంలో సెల్ఫీ అనేది ఫ్యాష‌న్ అయిపోయింది. సెల్ఫీలు దిగేందుకు యువ‌తీయువ‌కులు తెగ ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ సెల్ఫీల వ‌ల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు ఉన్నాయి. తాజాగా సెల్ఫీ మోజులో ప‌డి ఓ ముగ్గురు యువ‌తులు ప్రాణాల‌ను పోగొట్టుకున్నారు. ఈ విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది.

అనంత‌గిరి మండ‌లం మూల‌గుమ్మిలోని ఓ జ‌ల‌పాతం వ‌ద్ద‌కు న‌లుగురు యువ‌తులు వెళ్లారు. అక్క‌డ సెల్ఫీ దిగేందుకు ఆ న‌లుగురు య‌త్నించారు. సెల్ఫీ దిగుతుండ‌గా.. ఆ అమ్మాయిలు జ‌ల‌పాతంలో ప‌డిపోయారు. ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, మ‌రో బాలిక ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రాణాలు కోల్పోయిన వారిని త్రిష‌(17), ర‌త్న‌కుమారి(16), ప‌విత్ర‌(16)గా గుర్తించారు. అంజ‌లి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుంది. వీరి సొంతూరు హుకుంపేట మండ‌లం జంబువ‌ల‌స గ్రామం. ఇటీవ‌లే వీరంతా ఇంట‌ర్ ప‌రీక్ష‌లు రాశారు. ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement