త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Husband Murder | స్కూల్ బ‌స్సు డ్రైవ‌ర్‌తో ఎఫైర్.. భ‌ర్త‌ను పాము కాటుతో చంపేసిన భార్య‌

Husband Murder | ఓ వివాహిత స్కూల్ బ‌స్సు డ్రైవ‌ర్‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. ఆ త‌ర్వాత అత‌న్ని పెళ్లి చేసుకోవాల‌నుకుంది. దీంతో భ‌ర్త‌కు పాము కాటు వేయించి.. మ‌ట్టుబెట్టింది.

S

National | Published On Jul 18, 2026, 5.33 pm IST

Husband Murder | స్కూల్ బ‌స్సు డ్రైవ‌ర్‌తో ఎఫైర్.. భ‌ర్త‌ను పాము కాటుతో చంపేసిన భార్య‌
Advertisement

Husband Murder | త్రినేత్ర‌.న్యూస్ : ఓ వివాహిత స్కూల్ బ‌స్సు డ్రైవ‌ర్‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. ఆ త‌ర్వాత అత‌న్ని పెళ్లి చేసుకోవాల‌నుకుంది. దీంతో భ‌ర్త‌కు పాము కాటు వేయించి.. మ‌ట్టుబెట్టింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మీర‌ట్ జిల్లాలోని బందోరా గ్రామానికి చెందిన అతుల్ ప‌న్వార్‌(32), దామిని(30) దంప‌తులు.. హ‌స్తినాపూర్‌లో ఓ కిరాయి ఇంట్లో ఉంటున్నారు. అయితే ఈ దంప‌తులు కృష్ణా కిడ్స్ ప్లే స్కూల్‌ను హ‌స్తినాపూర్‌లో నిర్వ‌హిస్తున్నారు. వీరి పాఠ‌శాల‌లో 150 మంది వ‌ర‌కు విద్యార్థులు ఉన్నారు. ఓ స్కూల్ బ‌స్సు కూడా ఉంది.

అయితే స్కూల్ బ‌స్సు డ్రైవ‌ర్ తుషార్‌తో దామిని ప్రేమాయ‌ణం కొన‌సాగించింది. ఆ ప్రేమ కాస్త వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. ప‌లుమార్లు శారీర‌కంగా ద‌గ్గ‌రైన వీరు.. పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. కానీ భ‌ర్త, ఆరేళ్ల కుమారుడు అడ్డంకిగా మారిపోయారు. దీంతో ఎలాగైనా అతుల్‌ను మట్టుబెట్టాల‌ని దామిని నిశ్చ‌యించుకుంది.

ఈ క్ర‌మంలో తుషార్‌తో క‌లిసి దామిని అతుల్ హ‌త్య‌కు కుట్ర చేసింది. పాముతో కాటు వేయిస్తే ఎవ‌రికి అనుమానం రాద‌ని భావించారు. దీంతో పాములు ప‌ట్టే వ్య‌క్తుల‌ను సంప్ర‌దించి, ఒక పామును కొనుగోలు చేశారు. ఇక ఎవ‌రికి అనుమానం రాకుండా.. బుధ‌వారం రాత్రి భ‌ర్త‌కు ఆహారంలో నిద్ర మాత్ర‌లు క‌లిపి ఇచ్చింది. అనంత‌రం అత‌ను ప‌డుకున్న బెడ్‌పైకి పామును వ‌దిలింది. ఆ పాము కాటేయ‌డంతో అతుల్ ప్రాణాలు కోల్పోయాడు.

కుటుంబ స‌భ్యుల‌కు అనుమానం రావ‌డంతో దామినిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దామినిని అదుపులోకి తీసుకుని విచారించ‌గా, చేసిన నేరాన్ని అంగీక‌రించింది. తుషార్‌తో త‌న‌కు వివాహేత‌ర సంబంధం ఉంద‌ని, దాంతో అత‌న్ని పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని తెలిపింది. అయితే అతుల్‌పై రూ. 20 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ఉంద‌ని, ఆ డ‌బ్బులు కూడా కాజేయాల‌న్న‌దే త‌మ ఆలోచ‌న అని దామిని పోలీసుల‌కు చెప్పి అంద‌రికీ షాకిచ్చింది. ఈ కేసులో పాములు ప‌ట్టే ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను కూడా అరెస్టు చేశారు.

Advertisement
Advertisement