live-in relationship | పెళ్లైన పురుషుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరం కాదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
live-in relationship | పెళ్లైన పురుషుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పెళ్లయిన వ్యక్తి.. వేరే మహిళతో ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తే.. ఏ చట్టం అడ్డుకోలేదని, అది నేరం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది.
live-in relationship | త్రినేత్ర.న్యూస్ : పెళ్లైన పురుషుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పెళ్లయిన వ్యక్తి.. వేరే మహిళతో ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తే.. ఏ చట్టం అడ్డుకోలేదని, అది నేరం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. షాజహాన్‌పూర్‌కు చెందిన నేత్రపాల్ అనే పెళ్లైన పురుషుడు.. 18 ఏళ్ల యువతితో సహజీవనం చేస్తున్నాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు సంబంధిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో.. మొత్తానికి ఈ కేసు కోర్టు మెట్లెక్కింది. పెళ్లైన పురుషుడు తమ బిడ్డతో సహజీవనం చేస్తున్నాడని ఇది నేరం అని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించింది.
పెళ్లైన పురుషుడు మరో మహిళతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్(సహజీవనం)లో ఉండడం నేరం కాదని అలహాబాద్ కోర్టు పేర్కొంది. ఇద్దరి సమ్మతితోనే సహజీవనంలో ఉన్నారు కాబట్టి.. ఎలాంటి నేరం కాదని స్పష్టం చేసింది. సామాజిక నైతికత వేరు, చట్టం వేరు. పౌరుల హక్కులను కాపాడే విషయంలో కోర్టులు సామాజిక అభిప్రాయాలకు లేదా నైతికతకు కట్టుబడి ఉండవు అని కోర్టు స్పష్టం చేసింది. నేత్రపాల్ పెళ్లైన వ్యక్తి అయినప్పటికీ, ఇద్దరు వయోజనులు ఇష్ట పూర్వకంగా కలిసి ఉండటాన్ని చట్టం అడ్డుకోదు. ప్రాథమికంగా ఇక్కడ ఎటువంటి నేరం జరిగినట్లు కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది.
తాను మేజర్‌ను అని పేర్కొంటూ షాజహాన్‌పూర్ ఎస్సీకి సదరు యువతి ఆధారాలతో కూడిన దరఖాస్తు సమర్పించింది. నేత్రపాల్‌తో ఇష్టపూర్వకంగానే ఉంటున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కూడా కోర్టు నొక్కి చెప్పింది. యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణభయం ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. ఇద్దరు వయోజనులను రక్షించడం పోలీసుల ప్రాథమిక విధి అని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ జంటకు పూర్తి రక్షణ కల్పించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది.
సంబంధిత వార్తలు

Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు
జులై 17, 2026

Law Student | కోర్టు హాలులో న్యాయమూర్తులపైకి పేపర్లు.. న్యాయ విద్యార్థి అరెస్ట్
జులై 15, 2026

Ashada Masam 2026 | రేపట్నుంచే ఆషాఢం.. పుట్టింటి బాటలో కొత్త పెళ్లి కూతుళ్లు..! ఇక ఆ కార్యానికి దూరమేనా..?
జులై 14, 2026
తాజావార్తలు
- ●Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు
- ●Employees Health Scheme | 'ఈహెచ్ఎస్' పథకం ప్రారంభం.. ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్
- ●Women's Hockey WC | మహిళల హాకీ ప్రపంచకప్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా సలీమా టెటే
- ●CBDT | విదేశీ ఆస్తుల వివరాలు ఇక ఏఐఎస్‌లో.. ఐటీఆర్ ఫైలింగ్‌కు సీబీడీటీ కొత్త సౌకర్యం..
- ●FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ తొలిసారి విజేతలకు చాంపియన్‌షిప్ రింగ్స్..! అభిమానులకు కూడా..!
- ●TECNO CAMON 50 Ultra 5G | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నికతో వచ్చిన టెక్నో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..

Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు

Employees Health Scheme | 'ఈహెచ్ఎస్' పథకం ప్రారంభం.. ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్

Women's Hockey WC | మహిళల హాకీ ప్రపంచకప్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా సలీమా టెటే

CBDT | విదేశీ ఆస్తుల వివరాలు ఇక ఏఐఎస్‌లో.. ఐటీఆర్ ఫైలింగ్‌కు సీబీడీటీ కొత్త సౌకర్యం..



