Women’s Hockey WC | మహిళల హాకీ ప్రపంచకప్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా సలీమా టెటే
Women's Hockey WC | ఎఫ్‌ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్-2026 కోసం భారత మహిళల జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. 20 మంది సభ్యులతో కూడిన జట్టుకు మిడ్‌ఫీల్డర్ సలీమా టెటే కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లకు జట్టుకు చోటు కల్పించారు. ఆగస్టు 15 నుంచి 30 వరకు నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
Women's Hockey WC | ఎఫ్‌ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్-2026 కోసం భారత మహిళల జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. 20 మంది సభ్యులతో కూడిన జట్టుకు మిడ్‌ఫీల్డర్ సలీమా టెటే కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లకు జట్టుకు చోటు కల్పించారు. ఆగస్టు 15 నుంచి 30 వరకు నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత జట్టు ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ శిక్షణ శిబిరంలో సన్నద్ధమవుతోంది. ఇటీవల అంతర్జాతీయ టోర్నీల్లో రాణించిన యువ క్రీడాకారిణులతో పాటు సీనియర్ ఆటగాళ్లను ఎంపిక చేశారు. గత నెల న్యూజిలాండ్‌లో జరిగిన ఎఫ్‌ఐహెచ్ నేషన్స్ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ టైటిల్ గెలుచుకోవడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
కోచ్ ఏమన్నారంటే..
భారత మహిళల జట్టు హెడ్‌కోచ్ స్జోర్డ్ మారిజ్నే మాట్లాడుతూ.. ప్రపంచకప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీని దృష్టిలో పెట్టుకుని సమతూకంగా జట్టును ఎంపిక చేశామని తెలిపారు. ప్రపంచకప్‌కు ముందు ఆటగాళ్లు ఎంతో కష్టపడ్డారని, జట్టు సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో అతిపెద్ద వేదికపై పోటీపడేందుకు ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.
భారత్ షెడ్యూల్ ఇలా..
ప్రపంచకప్‌లో భారత్‌ను పూల్-డీలో ఉన్నది. చైనా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లతో కలిసి ఆడనుంది. గ్రూప్ దశలోని అన్ని మ్యాచ్‌లు నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్‌వీన్‌లో ఉన్న వాగెనార్ హాకీ స్టేడియంలో జరుగుతాయి. భారత్ తొలి మ్యాచ్‌ను ఆగస్టు 16న చైనాతో ఆడనుంది. అనంతరం ఆగస్టు 18న దక్షిణాఫ్రికా, ఆగస్టు 20న ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
భారత జట్టు ఇదే..
గోల్‌కీపర్లు : సవిత, బిచు దేవి ఖరిబామ్
డిఫెండర్లు: ఇషికా చౌదరి, సుశీలా చాను పుఖ్రంబామ్, లాల్‌తంతలుంగి, జ్యోతి, శిల్పి దబాస్
మిడ్‌ఫీల్డర్లు: నిక్కీ ప్రధాన్, సాక్షి రాణా, సునెలితా టొప్పో, సలీమా టెటే (కెప్టెన్), నేహా, దీపికా సోరెంగ్
ఫార్వర్డ్స్: లాల్‌రెంసియామి, రుతుజా దాదాశ్రో పిసాల్, నవ్‌నీత్ కౌర్, దీపికా, ఇషికా, బల్జీత్ కౌర్, బ్యూటీ డంగ్ డంగ్.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CBDT | విదేశీ ఆస్తుల వివరాలు ఇక ఏఐఎస్‌లో.. ఐటీఆర్ ఫైలింగ్‌కు సీబీడీటీ కొత్త సౌకర్యం..
- ●FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ తొలిసారి విజేతలకు చాంపియన్‌షిప్ రింగ్స్..! అభిమానులకు కూడా..!
- ●TECNO CAMON 50 Ultra 5G | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నికతో వచ్చిన టెక్నో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
- ●MLA Rakesh Reddy | విద్యార్థినులారా.. నేన్ చెప్తున్నా.. షోరూమ్‌ల నుంచి స్కూటీలు ఎత్తుకెళ్లండి
- ●Sun Holidays | సూర్యుడికి 9 రోజులు సెలవులు.. ఎప్పుడో తెలుసా..?
- ●Mouni Roy | మొన్ననే విడాకులు - అప్పుడే కొత్త ప్రియుడితో షికార్లు - హాట్ బ్యూటీ మౌనీరాయ్‌ని ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు

CBDT | విదేశీ ఆస్తుల వివరాలు ఇక ఏఐఎస్‌లో.. ఐటీఆర్ ఫైలింగ్‌కు సీబీడీటీ కొత్త సౌకర్యం..

FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ తొలిసారి విజేతలకు చాంపియన్‌షిప్ రింగ్స్..! అభిమానులకు కూడా..!

TECNO CAMON 50 Ultra 5G | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నికతో వచ్చిన టెక్నో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..

MLA Rakesh Reddy | విద్యార్థినులారా.. నేన్ చెప్తున్నా.. షోరూమ్‌ల నుంచి స్కూటీలు ఎత్తుకెళ్లండి





