త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్‌లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు

Madhya Pradesh High Court | ప‌ర‌స్ప‌ర అంగీకారంతో స‌హ‌జీవ‌నం (live in relationship) చేస్తూ ఆ త‌ర్వాత పెళ్లి చేసుకోలేక‌పోయినంత మాత్రాన దాన్ని అత్యాచారంగా భావించ‌లేమ‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు (Madhya Pradesh High Court) స్ప‌ష్టం చేసింది.

D

National | Published On Jul 17, 2026, 4.07 pm IST

Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్‌లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు
Advertisement

Madhya Pradesh High Court | ప‌ర‌స్ప‌ర అంగీకారంతో స‌హ‌జీవ‌నం (live in relationship) చేస్తూ ఆ త‌ర్వాత పెళ్లి చేసుకోలేక‌పోయినంత మాత్రాన దాన్ని అత్యాచారంగా భావించ‌లేమ‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు (Madhya Pradesh High Court) స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు అత్యాచారం, ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించాడంటూ నిందితుడిపై న‌మోదైన కేసుల‌ను కోర్టు కొట్టివేసింది.

ప్రాసిక్యూష‌న్ క‌థ‌నం ప్ర‌కారం.. ఇద్ద‌రు యువ‌తీ, యువ‌కులు ప‌ర‌స్ప‌ర అంగీకారంతో స‌హ‌జీవ‌నం చేశారు. వీరిద్ద‌రి బంధం గురించి యువ‌తి కుటుంబానికి ముందే తెలుసు. వారు కూడా ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేదు. దీంతో వారు త‌మ బంధాన్ని కొన‌సాగించారు. ఈ క్ర‌మంలో యువ‌తి గ‌ర్భం దాల్చింది. అయితే, పెళ్లి విష‌యంలో త‌లెత్తిన వివాదం కార‌ణంగా స‌ద‌రు యువ‌తి పొలంలో ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనిపై బాధితురాలి కుటుంబం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ద‌ర్యాప్తులో యువ‌కుడు పెళ్లికి నిరాక‌రించ‌డంతోనే యువ‌తి ఆత్మ‌హత్య చేసుకున్న‌ట్లు తేలింది. దీంతో స‌ద‌రు యువ‌కుడిపై పోలీసులు అత్యాచారం, ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించ‌డం వంటి అభియోగాలు మోపారు.

ఆరోప‌ణ‌ల‌కు స‌రైన ఆధారాలు లేవు..

ఈ కేసుపై మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ సంద‌ర్భంగా వాదోప‌వాదాలు కొన‌సాగాయి. యువ‌కుడిపై మోపిన ఆరోప‌ణ‌ల‌కు స‌రైన ఆధారాలు లేవ‌ని నిందితుడి త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించారు. డీఎన్ఏ టెస్ట్‌లో యువ‌తి గ‌ర్భానికి నిందితుడే కార‌ణ‌మ‌ని తేలిన‌ప్ప‌టికీ.. వారి మ‌ధ్య సంబంధం ప‌ర‌స్ప‌ర అంగీకారంతో జ‌రిగింద‌ని పేర్కొన్నారు. అయితే, పెళ్లి చేసుకోవాలంటే నిందితుడు ఇల్లు డిమాండ్ చేశాడంటూ మృతురాలి కుటుంబం ఆరోపించింది. ఇల్లు ఇవ్వ‌నందుకే పెళ్లికి నిరాక‌రించాడంటూ తెలిపింది. పెళ్లి పేరుతో మోసం చేసి శారీర‌క సంబంధం పెట్టుకున్నాడంటూ మృతురాలి త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించారు. అతను పెళ్లికి నిరాకరించడం వల్లే మనస్తాపానికి గురై బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని కోర్టుకు వివరించారు.

అత్యాచారంగా పరిగణించలేం..

ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న జస్టిస్ రాజేంద్ర కుమార్ వాణి నేతృత్వంలోని బెంచ్.. కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. కేవలం పెళ్లికి నిరాకరించినంత మాత్రాన ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని పేర్కొంది. నిందితుడు కేవ‌లం త‌న శారీర‌క వాంఛ‌ను తీర్చుకోవ‌డానికే యువ‌తితో సంబంధాన్ని పెట్టుకున్న‌ట్లు ఎలాంటి బ‌ల‌మైన ఆధారాలూ లేవ‌ని తెలిపింది. పైగా వీరిద్ద‌రి మ‌ధ్య బంధం మృతురాలి త‌ల్లిదండ్రులు, సోద‌రుడికి ముందే తెలుసున‌ని గుర్తు చేసింది. అంద‌రికీ తెలిసే రిలేష‌న్ షిప్ కొన‌సాగించార‌ని వ్యాఖ్యానించింది.

ప్రాథమికంగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉండి, ఆ తర్వాత అనుకోని పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోలేకపోతే దానిని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇక ఇల్లు డిమాండ్ చేశాడ‌నే అంశానికి కూడా స‌రైన ఆధారాలు లేవ‌ని పేర్కొంది. ఇల్లు డిమాండ్ చేస్తూ పెళ్లికి నిరాక‌రించాడ‌ని అనుకున్నా.. ఆ చ‌ర్య‌ను ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించడంగా భావించ‌లేమ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ప్రాసిక్యూషన్ నిందితుడిపై మోపిన నేరాలను నిరూపించడంలో విఫలమైందని హైకోర్టు తేల్చింది. ఈ మేర‌కు నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేయాలని ఆదేశించింది.

Also Read..

మహిళల హాకీ ప్రపంచకప్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా సలీమా టెటే

విదేశీ ఆస్తుల వివరాలు ఇక ఏఐఎస్‌లో.. ఐటీఆర్ ఫైలింగ్‌కు సీబీడీటీ కొత్త సౌకర్యం..

విద్యార్థినులారా.. నేన్‌ చెప్తున్నా.. షోరూమ్‌ల నుంచి స్కూటీలు ఎత్తుకెళ్లండి

Advertisement
Advertisement