Bomb Blast | రైల్వే స్టేషన్‌లో పేలుళ్లు.. 35 ఏండ్ల తర్వాత టెర్రరిస్టు అరెస్ట్
Bomb Blast | నేరం జరిగిన 35 తర్వాత ఆ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 1991లో జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir) జమ్ము రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుళ్లు (Bomb Blast) సంభవించాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Bomb Blast | త్రినేత్ర.న్యూస్: నేరం జరిగిన 35 తర్వాత ఆ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 1991లో జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir) జమ్ము రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుళ్లు (Bomb Blast) సంభవించాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన రైల్వే పోలీసులు (GRP).. 35 తర్వాత పేలుడుతో సంబంధమున్న టెర్రరిస్టు (Terrorist) అల్తాఫ్ హుస్సెయిన్ షేఖ్‌ను తాజాగా అరెస్టు చేశారు.
1991, ఏప్రిల్ 2న జమ్ము రైల్వే స్టేషన్‌లోని (Jammu Railway Station) ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు పారా మిలిరీ సిబ్బంది సహా ముగ్గురు మరణించారు. మరో 18 మంది సాధారణ పౌరులు గాయపడ్డారు. ఈ కేసులో అమానుల్లా ఖాన్‌ను గతంలోనే పోలీసులు అరెస్టు చేశారు. అల్తాఫ్ (Altaf Hussain Sheikh) సహా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారిలో అల్తాఫ్‌ను ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. చాలకాలంగా అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే బీజ్‌బేహారా ప్రాంతంలో వ్యాపారవేత్తగా చలామణి అవుతున్నట్లు గుర్తించామని, ఎట్టకేలకు అతడిని అరెస్టు చేశామని చెప్పారు.
తాజావార్తలు
- ●GATE 2027 Reschedule | మారిన షెడ్యూల్.. గేట్ 2027 రిజిస్ట్రేషన్లు ఎప్పుడంటే?
- ●Hyderabad | డెలివరి విషయంలో స్నేహితుల మధ్య గొడవ.. యువకుడి దారుణ హత్య
- ●Tunnel Collapse | ఉత్తరాఖండ్‌లో సొరంగ ప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం
- ●Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

GATE 2027 Reschedule | మారిన షెడ్యూల్.. గేట్ 2027 రిజిస్ట్రేషన్లు ఎప్పుడంటే?

Hyderabad | డెలివరి విషయంలో స్నేహితుల మధ్య గొడవ.. యువకుడి దారుణ హత్య

Tunnel Collapse | ఉత్తరాఖండ్‌లో సొరంగ ప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం

Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!






