GATE 2027 Reschedule | మారిన షెడ్యూల్.. గేట్ 2027 రిజిస్ట్రేషన్లు ఎప్పుడంటే?
GATE 2027 Reschedule | గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2027) షెడ్యూల్ (GATE 2027 Reschedule)మారింది. శుక్రవారం నుంచి ప్రారంభంకావాల్సిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా పడింది. దరఖాస్తులు ఆగస్టు 27న ప్రారంభమవుతుందని ఐఐటీ మద్రాస్ (IIT Madras) వెల్లడించింది.
GATE 2027 Reschedule | త్రినేత్ర.న్యూస్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2027) షెడ్యూల్ (GATE 2027 Reschedule)మారింది. శుక్రవారం నుంచి ప్రారంభంకావాల్సిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా పడింది. దరఖాస్తులు ఆగస్టు 27న ప్రారంభమవుతుందని ఐఐటీ మద్రాస్ (IIT Madras) వెల్లడించింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగస్టు 14 నుంచి ఉంటుందని తొలుత ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మార్పులు చేసిన పరీక్ష నిర్వాహక సంస్థ ఐఐటీ మద్రాస్.. ఈ నెల 27నుంచి సెప్టెంబర్ 27వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఆలస్య రుసుంతో అక్టోబర్ 5వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అయితే రిజిస్ట్రేషన్‌కు డిజిలాకర్ (Digi Locker) తప్పనిసరని పేర్కొంది.
దరఖాస్తు చేసే ముందే అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ డిజిలాకర్ ఖాతాను క్రియేట్ లేదా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (Online Registration) సమయంలో దరఖాస్తుదారులు తమ డిజిలాకర్‌ను అనుసంధానం చేయాలని, దీనివల్ల ధ్రువీకరించిన వ్యక్తిగత సమాచారాన్ని పోర్టల్ సురక్షితంగా సేకరించగలుగుతుందని వెల్లడించింది. అభ్యర్థి ఒకసారి అనుమతి ఇచ్చాక వారి పేరు, పుట్టిన తేదీ, ప్రొఫైల్ ఫొటో, వెరిఫైడ్ గుర్తింపు పత్రం నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, ఇంటి అడ్రస్ వంటి వ్యక్తిగతమైన వివరాలను ఆటోమేటిక్‌గా పోర్టల్ సేకరిస్తుందని తెలిపింది. గేట్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 13, 14, 20, 21 తేదీల్లో జరగనున్నాయి. ఫలితాలను మార్చి 19న ప్రకటించనుంది.
గేట్ 2027 షెడ్యూల్
ఆన్‌లైన్ అప్లికేషన్లు: ఆగస్టు 27
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 27
ఆలస్య రుసుంతో: అక్టోబర్ 5
సిటీ అలాట్‌మెంట్ నోటిఫికేషన్: 2027 జనవరి 4
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: 2027 ఫిబ్రవరి 6, 7
గేట్ పరీక్ష: 2027 ఫిబ్రవరి 13, 14, 20, 21
పరీక్ష ఫలితాలు: 2027 మార్చి 19
పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
సంబంధిత వార్తలు

DRDO | డీఆర్డీఓలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
ఆగస్టు 7, 2026

Dasoju Sravan | స్టూడెంట్స్ డేటానే ఈజీగా లీక్ చేశారు.. రేపు క్వశ్చన్ పేపర్లు భద్రంగా ఉంటాయన్న గ్యారెంటి ఏంటి?: దాసోజు శ్రావణ్
జూన్ 5, 2026

CV Anand | ఆయన ఐపీఎస్.. ఆమె ఐఐటీ.. సీవీ ఆనంద్ దంపతుల అద్భుత ప్రయాణం!
మే 1, 2026
తాజావార్తలు
- ●Hyderabad | డెలివరి విషయంలో స్నేహితుల మధ్య గొడవ.. యువకుడి దారుణ హత్య
- ●Tunnel Collapse | ఉత్తరాఖండ్‌లో సొరంగ ప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం
- ●Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

Hyderabad | డెలివరి విషయంలో స్నేహితుల మధ్య గొడవ.. యువకుడి దారుణ హత్య

Tunnel Collapse | ఉత్తరాఖండ్‌లో సొరంగ ప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం

Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి



