Tunnel Collapse | ఉత్తరాఖండ్‌లో సొరంగ ప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం
Tunnel Collapse | రాష్ట్రంలో శ్రీశైలం ఎడమగట్టు సొరంగం కుప్పకూలిన (Tunnel Collapse) ఘటన తెలిసింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం చెందారు. అలాంటి ఘటనే ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) చమోలీ జిల్లాలోనూ జరిగింది.
Tunnel Collapse | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో శ్రీశైలం ఎడమగట్టు సొరంగం కుప్పకూలిన (Tunnel Collapse) ఘటన తెలిసింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం చెందారు. అలాంటి ఘటనే ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) చమోలీ జిల్లాలోనూ జరిగింది. పిపాల్‌కోటి సమీపంలోని మాయాపూర్‌లో నిర్మిస్తున్న టీహెడీసీ (THDC) టన్నెల్‌లోకి ఒక్కసారిగా నీరు, బురద చేరింది. దీంతో 20 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిలో ఆరుగురు కార్మికులు మరణించారు. 14 మంది కార్మికులు గాయపడగా, మరో ఇద్దరు టన్నెల్‌లో (workers trapped) చిక్కుకుపోయారు. వారికోసం సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.

చమోలీలో (Chamoli) సుమారు 2 కిలోమీటర్ల పొడవైన ‘టెయిల్ రేస్ టన్నెల్’లో సుమారు 1.4 కిలోమీటర్ల లోతులో భూమి కుంగి రంధ్రం ఏర్పడింది. దీంతో అకస్మాత్తుగా నీరు, బురద లోపలికి రావడంతో అప్పటికే విధులు నిర్వహిస్తున్న 22 మంది కార్మికులలో 20 మంది చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్‌ఎఫ్ , ఎస్‌డీఆర్‌ఎఫ్ , ఐటీబీపీ, ఆర్మీ బృందాలు రంగంలోకి దిగాయి. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలతో ఇప్పటికే 14 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మిగిలిన ఇద్దరిని బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నీటిని బయటకు పంపింగ్ చేసేందుకు ప్రత్యేక పంపులను ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదం గురువారం సాయంత్రం 6.45 గంటల సమయంలో జరిగిందని అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో ఒక్కసారిగా నీరు, బురద టన్నెల్‌లోకి వచ్చాయని చెప్పారు. దీంతో ఆ సయంలో షిఫ్ట్‌లో ఉన్న కార్మికులంతా అందులో చిక్కుకుపోయారని వెల్లడించారు.

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని పేర్కొంటూ, సహాయక చర్యలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
సంబంధిత వార్తలు

Mallikarjun Kharge | ఆ ఘటన చాలా అవమానంగా అనిపించింది.. హల్ద్వానీలో వేదిక శుద్ధిపై ఖర్గే భావోద్వేగం
ఆగస్టు 13, 2026

Chardham Yatra | ఉత్తరాఖండ్‌లో వర్షాల బీభత్సం.. చార్ధామ్ యాత్రకు బ్రేక్..
జులై 28, 2026

Heavy Rain | దేశవ్యాప్తంగా ముంచెత్తిన భారీ వర్షాలు.. నీట మునిగిన ఢిల్లీ.. కశ్మీర్, కేరళ అతలాకుతలం
జులై 9, 2026
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్

Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!



