త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tejas Fighter jet | మరో తేజస్‌ ఫైటర్‌ జెట్‌కు ప్రమాదం.. రెండేళ్ల‌లో మూడో ఘ‌ట‌న‌

Tejas Fighter jet | భారత వైమానిక దళం (IAF)కి చెందిన మ‌రో తేజస్ యుద్ధ విమానం (Tejas Fighter jet) ప్ర‌మాదానికి గురైంది. సాధారణ శిక్షణా కార్యక్రమం పూర్తి చేసుకున్న‌ తర్వాత ఓ కీల‌క‌ ఎయిర్‌బేస్‌లో (air base) ల్యాండింగ్ స‌మ‌యంలో బ్రేకులు ఫెయిల్ కావ‌డంతో ప్ర‌మాదానికి గురైంది.

D

National | Published On Feb 23, 2026, 10.47 am IST

Tejas Fighter jet | మరో తేజస్‌ ఫైటర్‌ జెట్‌కు ప్రమాదం.. రెండేళ్ల‌లో మూడో ఘ‌ట‌న‌
Advertisement

Tejas Fighter jet | భారత వైమానిక దళం (IAF)కి చెందిన మ‌రో తేజస్ యుద్ధ విమానం (Tejas Fighter jet) ప్ర‌మాదానికి గురైంది. సాధారణ శిక్షణా కార్యక్రమం పూర్తి చేసుకున్న‌ తర్వాత ఓ కీల‌క‌ ఎయిర్‌బేస్‌లో (air base) ల్యాండింగ్ స‌మ‌యంలో బ్రేకులు ఫెయిల్ కావ‌డంతో ప్ర‌మాదానికి గురైంది. ర‌న్‌వేనుదాటి ముందుకు దూసుకెళ్లింది. పైల‌ట్ అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించి ఎజెక్ట్ అవ్వ‌డంతో ప్రాణాపాయం త‌ప్పింది. ఫిబ్ర‌వ‌రి 7న జ‌రిగిన ఈ ప్ర‌మాదం ఇప్పుడు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ ప్ర‌మాదంలో ఎయిర్‌ఫ్రేమ్‌కు న‌ష్టం వాటిల్లిన‌ట్లు అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఆన్‌బోర్డ్ వ్యవస్థల్లో సాంకేతికలోపం కార‌ణంగా ప్ర‌మాదం జ‌రిగి ఉండొచ్చ‌ని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం అనంతరం, IAF తక్షణమే జాగ్రత్త చర్యగా దాదాపు 30 సింగిల్-సీట్ తేజస్ యుద్ధ విమానాలన్నింటినీ సాంకేతిక తనిఖీల కోసం తాత్కాలికంగా గ్రౌండ్ చేసింది. ఇంటెన్సివ్ టెక్నికల్ దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా, IAFలోకి ప్రవేశించిన త‌ర్వాత‌ తేజ‌స్ ఫైట‌ర్ జెట్ ప్ర‌మాదానికి గురి కావ‌డం ఇది మూడోసారి.

తొలుత 2024 మార్చిలో రాజ‌స్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో తేజ‌స్ ఫైట‌ర్ జెట్ ప్ర‌మాదానికి గురైంది. ఫైర్ పవర్ ప్రదర్శన ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో జరిగిన ఆ ప్రమాదంలో కూడా పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. రెండవ ప్రమాదం నవంబర్ 2025లో దుబాయ్ ఎయిర్ షో సందర్భంగా చోటుచేసుకుంది. ఆ ప్రదర్శనలో పాల్గొంటున్న సమయంలో విమానం ఒక్క‌సారిగా కూలిపోవడంతో వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ తీవ్రంగా గాయపడి మరణించారు. ఇప్పుడు మూడోసారి తేజ‌స్ ఫైట‌ర్ ప్ర‌మాదానికి గురికావ‌డం వీటి భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న త‌లెత్తుతోంది.

తేజ‌స్‌.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 4.5 జనరేషన్ తేలికపాటి మల్టీ-రోల్ యుద్ధ విమానం. దీనిని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మరియు ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) రూపొందించాయి. పాతబడిన మిగ్-21 విమానాల స్థానంలో వీటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ కోసం ఉపయోగిస్తున్నారు. అఫెన్సివ్‌ ఎయిర్‌ సపోర్టు తీసుకునేలా‌, గ్రౌండ్‌ ఆపరేషన్స్‌లో క్లోజ్‌ కంబాట్‌ సపోర్టును సమకూర్చేలా ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను డిజైన్‌ చేశారు. 1963 నుంచి ఐఏఎఫ్‌లో సేవలు అందిస్తున్న మిగ్‌-21ల స్థానంలో వీటిని తీసుకొచ్చారు. 2001 జనవరి 4న తొలి తేజస్‌ ఫైటర్‌ జట్‌ గాల్లోకి ఎగిరింది. ఆ రోజు భారత వైమానిక దళం చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.

Advertisement

తాజావార్తలు

Advertisement