త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil Nadu Elections | డీఎంకే కూట‌మిలో కుదిరిన పొత్తులు.. 164 స్థానాల్లో పోటీ చేయ‌నున్న స్టాలిన్ పార్టీ..!

Tamil Nadu Elections | త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ది. అధికార డీఎంకే, మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య సీట్ల పంపిణీ కొలిక్కి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఒప్పందం వివ‌రాల‌ను ముఖ్య‌మంత్రి, ఆ పార్టీ అధినేత ఎంకే స్టానిల్ ప్ర‌క‌టించారు.

P

National | Published On Mar 28, 2026, 6.14 pm IST

Tamil Nadu Elections | డీఎంకే కూట‌మిలో కుదిరిన పొత్తులు.. 164 స్థానాల్లో పోటీ చేయ‌నున్న స్టాలిన్ పార్టీ..!
Advertisement

Tamil Nadu Elections | త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ది. అధికార డీఎంకే, మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య సీట్ల పంపిణీ కొలిక్కి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఒప్పందం వివ‌రాల‌ను ముఖ్య‌మంత్రి, ఆ పార్టీ అధినేత ఎంకే స్టానిల్ ప్ర‌క‌టించారు. మొత్తం 234 అసెంబ్లీ సీట్లు ఉండ‌గా.. డీఎంకే 164 స్థానాల్లో పోటీ చేయ‌నుంది. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి 28 స్థానాలు కేటాయించింది. ఈసారి జరిగిన సీట్ల పంపకంలో డీఎండీకే పార్టీకి షాక్ త‌గిలింది. ఆ పార్టీ కేవ‌లం ప‌ది సీట్లు మాత్ర‌మే కేటాయించారు. ఇతర మిత్రపక్షాల విషయానికి వస్తే వీసీకే పార్టీకి ఎనిమిది, క‌మ్యూనిస్ట్ పార్టీలైన సీపీఎం పార్టీల‌కు చెరో ఐదు, ఎండీఎంకే పార్టీకి నాలుగు సీట్లు కేటాయించింది. ముస్లిం ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ట్టున్న ఐయూఎంఎల్‌, ఎంఎంకే పార్టీల‌కు చెరో రెండు స్థానాలు, ఎంజేకే, ఎస్‌డీపీఐ పార్టీల‌కు చెరో సీటు కేటాయించిన‌ట్లు స్టాలిన్ ప్ర‌క‌టించారు.

బోడినాయకనూర్ నుంచి పన్నీర్‌సెల్వం..

ఈ జాబితాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అభ్యర్థి ఓ పన్నీర్‌సెల్వం. గ‌తంలో ఆయ‌న అన్నాడీఎంకే పార్టీలో కీల‌క నేత‌. ఆ పార్టీ త‌ర‌ఫున ముఖ్య‌మంత్రిగానూ సేవ‌లు అందించారు. ఆ పార్టీలో ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామితో విభేదాల నేప‌థ్యంలో ఆయ‌న డీఎంకే పార్టీలో చేరారు. కూట‌మి అభ్య‌ర్థిగా బోడినాయ‌క‌నూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్నారు. పన్నీర్‌సెల్వంను తన కూటమిలోకి చేర్చుకోవడం ద్వారా దక్షిణ తమిళనాడులోని ముక్కులథోర్ ఓటు బ్యాంకును చీల్చేందుకు స్టాలిన్ వ్యూహాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా డీఎంకే త‌న పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. మ‌ళ్లీ సీనియ‌ర్ నేత‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీ సీనియ‌ర్ నేత కేకేఎస్ఎస్ఆర్ రామ‌చంద్ర‌న్ అరుప్పుకోట్టై నుంచి తిరిగి పోటీ చేయ‌నున్నారు. క‌న్యాకుమారి నుంచి మ‌హేశ్‌, పాల‌యంకోటై నుంచి వ‌హాబ్ బ‌రిలోకి దిగ‌నున్నారు. స్టాలిన్ ఈ నిర్ణ‌యం ద్ర‌విడ అభివృద్ధి మోడ‌ల్‌తో పాటు బ‌ల‌మైన సామాజిక సంబంధాల‌తో తిరిగి మ‌ళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాల‌నే వ్యూహాన్ని అనుస‌రిస్తున్న‌ట్లు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement