Sai Pallavi | డబ్బుల కోసం ముద్దులు పెట్టను – కియారాకు సాయిపల్లవి కౌంటర్
డబ్బుల కోసం లిప్‌లాక్‌లు, ఇంటిమేట్ సీన్లు చేసే టైప్ తాను కాదని సాయిపల్లవి అన్నది. కియారా అద్వానీకి కౌంటర్‌గానే సాయి పల్లవి ఈ కామెంట్లు చేసిందని నెటిజన్లు అంటున్నారు. యశ్ టాక్సిక్‌లో కియారా బోల్డ్ రోల్‌లో కనిపించడంపై దారుణంగా విమర్శలు వస్తున్నాయి.
Entertainment | Published On Jul 9, 2026, 4.06 pm IST
Sai Pallavi | నేటి సినిమాల్లో లిప్‌లాక్‌లు కామన్‌గా మారాయి. ముద్దు సన్నివేశాలు లేకుండా దర్శకులు కథలు రాయడం లేదు. సినిమాలు తీయడం లేదు. ఈ లిప్‌లాక్‌లు సినిమాలకు ప్రధాన ప్రచారాస్త్రాల్లో ఒకటిగా మారిపోయాయి. అయితే ఈ ముద్దు సన్నివేశాల్లో నటించడానికి హీరోయిన్లు ఎక్స్‌ట్రా రెమ్యూనరేషన్లు డిమాండ్ చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. రెమ్యూనరేషన్ల కోసమే లిప్‌లాక్‌లు, బోల్డ్, ఇంటిమేట్ సీన్లలో నేటితరం హీరోయిన్లు నటిస్తున్నారనే విమర్శలు తరచుగా వినిపిస్తున్నాయి.
నో లిప్‌లాక్ రూల్....
నాచురల్ బ్యూటీ సాయిపల్లవి మాత్రం కెరీర్ ఆరంభం నుంచి నో లిప్‌లాక్ రూల్‌ను పాటిస్తోంది. ముద్దు సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్లు తాను చేయనని చాలా మందికి తెలుసునని, అయినా ఇప్పటికీ కొందరు దర్శకులు బోల్డ్ కథలతో సంప్రదిస్తుంటారని సాయిపల్లవి అన్నది. డబ్బుల కోసం అలాంటి సినిమాలు చేసే వ్యక్తిత్వం తనది కాదని చెప్పి సున్నితంగా వారి ఆఫర్లను తిరస్కరిస్తుంటానని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి పేర్కొన్నది.
ఉన్నవాటితో సంతృప్తిగా...
"ఓ మంచి ఫ్యామిలీతో పాటు ఇల్లు, కారు, సరిపడా డబ్బు..ఓ మనిషి ఆనందంగా జీవితాన్ని గడపటానికి ఇంతకుమించి కావాల్సిందే లేదు. అవన్నీ నాకు ఉన్నాయి. కావాల్సిన దానికి మించి డబ్బు కూడబెట్టుకోవడానికో...ఇంకో కారు కొనడానికో మరొకరిని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఉన్నవాటితో సంతృప్తిగా బతకడానికే ఇష్టపడతాడు. బోల్డ్ కథలు నాకు సరిపోవు. అది తెలిసి కూడా కొందరు దర్శకులు కావాలనే గ్లామర్ కథలతో నా దగ్గరకు వస్తుంటారు. కేవలం యాక్టింగ్ కోసమే కావాలంటే నన్ను తీసుకొండి. లిప్‌లాక్‌లు, ఇంటిమేట్ సీన్ల కోసమే అయితే మరొకరిని చూసుకోమని అర్థమయ్యేలా చెబుతుంటా. నా మాటల వల్ల హర్టయిన డైరెక్టర్లు ఉన్నాయి. కానీ ఇబ్బంది పడుతూ సినిమాలు చేయడం కంటే ముందే తప్పుకోవడం మంచిదని నా అభిప్రాయం" అని సాయిపల్లవి అన్నది.
కియారాకు కౌంటర్...
కియారా అద్వానీకి కౌంటర్‌గానే సాయిపల్లవి ఈ కామెంట్లు చేసిందని నెటిజన్లు అంటున్నారు. యశ్ టాక్సిక్‌లో కియారా బోల్డ్ రోల్ చేసింది. యశ్, కియారా అద్వానీ లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్లు వైరల్ అవుతోన్నాయి. డబ్బుల కోసం ఇంతలా దిగజారడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. పెళ్లి తర్వాత ఇలాంటి సీన్లు చేయడం ఏంటంటూ కియారాను ట్రోల్ చేస్తున్నారు. సాయిపల్లవిని చూసి నేర్చుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
సంబంధిత వార్తలు

National Awards | నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే – బెస్ట్ యాక్టర్‌గా మమ్ముట్టి – ఉత్తమ నటిగా యామీ గౌతమ్
జులై 18, 2026

Amir Khan | ఆమిర్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..
జులై 18, 2026

Akshara Haasan | శృతి హాసన్ చెల్లెలు హీరోయిన్ – డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ – ఫ్రీ స్ట్రీమింగ్
జులై 17, 2026
తాజావార్తలు
- ●Horoscope | జూలై 19 రాశి ఫలాలు.. మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం!
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ

Horoscope | జూలై 19 రాశి ఫలాలు.. మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం!

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క



