త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prashant Kishor | ముందు ప‌దో త‌ర‌గ‌తి పాస‌వ్వండి.. బీహార్ సీఎం, విప‌క్షనేత‌కు ప్ర‌శాంత్ కిషోర్ స‌వాల్‌

Prashant Kishor | ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసి ఉత్తీర్ణుల‌వ్వాలంటూ బీహార్ ముఖ్య‌మంత్రి సామ్రాట్ చౌద‌రి, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్‌కు జ‌న్ సూర‌జ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, బంకీపూర్ ఎమ్మెల్యే ప్ర‌శాంత్ కిశోర్ (Prashant Kishor) స‌వాల్ విసిరారు.

G

National | Published On Aug 26, 2026, 8.11 am IST

Prashant Kishor | ముందు ప‌దో త‌ర‌గ‌తి పాస‌వ్వండి.. బీహార్ సీఎం, విప‌క్షనేత‌కు ప్ర‌శాంత్ కిషోర్ స‌వాల్‌
Advertisement

Prashant Kishor | త్రినేత్ర‌.న్యూస్‌: ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసి ఉత్తీర్ణుల‌వ్వాలంటూ బీహార్ ముఖ్య‌మంత్రి సామ్రాట్ చౌద‌రి, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్‌కు జ‌న్ సూర‌జ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, బంకీపూర్ ఎమ్మెల్యే ప్ర‌శాంత్ కిషోర్ (Prashant Kishor) స‌వాల్ విసిరారు. విద్యార్థుల ఆందోళనలు, ఇతర విషయాలపై మాట్లాడే ముందు ధైర్యముంటే ఇద్ద‌రు నేత‌లు ఒకేసారి కూర్చుని పదో తరగతి (Matriculation Exams) పరీక్ష రాసి పాస్ కావాలన్నారు.

70వ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షలో అవకతవకలు జరిగాయని, వెంటనే ఆ పరీక్షను రద్దు చేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న వందలాది మంది అభ్యర్థులు రాజ‌ధాని పాట్నాలో మంగ‌ళ‌వారం భారీ ధ‌ర్నా నిర్వ‌హించారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) నివాసాన్ని ముట్టడించేందుకు భారీ ర్యాలీగా బయలుదేరగా.. దారిమ‌ధ్య‌లో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న‌ది.

క్యాబినెట్ సమావేశంలో ప్ర‌తిపాదించండి..

ఈనేప‌థ్యంలో విద్యార్థుల నిర‌స‌న‌ల‌కు మద్దతు ఇచ్చే ముందు ఆర్జేడీ (RJD) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, విప‌క్ష‌నాయకుడు తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) తన 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని రాష్ట్ర మంత్రి తివారీ మండిప‌డ్డారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ.. తివారీ ఇదే సలహాను సీఎం సామ్రాట్ చౌదరికి కూడా ఇవ్వాల‌న్నారు. సీఎం, ప్రతిపక్ష నేత ఇద్దరూ కలిసి మెట్రిక్యులేషన్ పరీక్షలు (Class 10 Exams) రాసేలా తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఆయన ప్రతిపాదన చేయాల‌ని డిమాండ్ చేశారు. బీహార్ యువత తరపున తాను ఈ విజ్ఞప్తి చేస్తున్నానని, ఇరువురు నేత‌లు త‌న‌ సవాల్‌ను స్వీకరించాలన్నారు. త‌మ నాయకులు కనీసం 10వ తరగతి పరీక్షలైనా పాస్ కాగలరనే నమ్మకం బీహార్ (Bihar) ప్రజలకు ఉండాల‌ని చెప్పారు. కాగా, తేజస్వి యాదవ్ 9వ తరగతి ఫెయిల్ అయిన తర్వాత త‌న పాఠశాల చదువును ఆపేశారు.

నిరూపించుకోండి..

అలాగే సామ్రాట్ చౌదరి గతంలో చేసిన ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ.. సీఎం త‌న‌కు డీలిట్ (DLitt) డిగ్రీ ఉన్నట్లు చెబుతున్నారని, అయితే 2010 ఎన్నికల అఫిడవిట్‌లో తాను 7వ తరగతి మాత్రమే పాస్ అయినట్లు పేర్కొన్నారని ప్ర‌శాంత్ కిషోర్‌ గుర్తు చేశారు. చౌదరి, యాదవ్ ఇద్దరూ కలిసి ఈ సవాల్‌ను స్వీకరించి, తాము 10వ తరగతి పరీక్షలను పాస్ అవ్వగలమని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు.

ఇవికూడా చ‌ద‌వండి..

పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు

ఆగిఉన్న కంటైన‌ర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బ‌స్సు.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

పాలిటిక్స్ వర్సెస్ ప్రోగ్రెస్: దేశాన్ని కుదిపేస్తున్న గుజరాత్ - తెలంగాణ వార్!

Advertisement
Advertisement