Toxic | ‘టాక్సిక్’ సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
Toxic | రాకింగ్ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ మూవీ 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెంచుకున్నారు. చాలా కాలం తర్వాత యశ్ వెండితెరపై కనిపించబోతుండడంతో.. అభిమానులు ఇప్పటికే థియేటర్ల వద్ద వాలిపోయారు. ఈ క్రమంలో టాక్సిక్ టీమ్ కీలక ప్రకటన జారీ చేసింది.
Toxic | త్రినేత్ర.న్యూస్ : రాకింగ్ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ మూవీ 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెంచుకున్నారు. చాలా కాలం తర్వాత యశ్ వెండితెరపై కనిపించబోతుండడంతో.. అభిమానులు ఇప్పటికే థియేటర్ల వద్ద వాలిపోయారు. ఈ క్రమంలో టాక్సిక్ టీమ్ కీలక ప్రకటన జారీ చేసింది.
‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అనేది మాకు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఎన్నో ఏళ్లుగా మేము ఫ్రేమ్ బై ఫ్రేమ్, సీన్ బై సీన్, ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధతో ఆలోచించి, మా హృదయాన్ని పెట్టి నిర్మించిన ఒక అద్భుతమైన ప్రపంచం. ఈ సినిమా నిర్మాణంలో, విడుదలలో భాగమైన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్, చిత్ర యూనిట్ సభ్యుడితో పాటు అభిమానులు కూడా థియేటర్‌లో సరిగ్గా అలాంటి అనుభూతినే పొందాలని ఆశిస్తున్నాం. ఈ సినిమాను అందరూ కలిసి వెండితెరపై చూసి ఆస్వాదించాలనే ఉద్దేశంతోనే రూపొందించాం. ఈ సినిమాపై మీరు ఇప్పటికే చూపిస్తున్న ప్రేమ, ఉత్సాహం, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అందిస్తున్న భారీ మద్దతును మాటల్లో చెప్పలేనిది. మా ఈ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అయితే, మీ అందరినీ మేము ఒకే ఒక్క విషయాన్ని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము. ఈ సినిమా అనుభూతిని అది ఎలా సాగాలో అలాగే సాగనివ్వండి. థియేటర్లలో సినిమాలోని దృశ్యాలను రికార్డ్ చేయకండి. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. కథలోని ట్విస్టులు, స్పాయిలర్లను బయటపెట్టకండి. ఈ సినిమా పట్ల అభిమానులకు ఉన్న అనుభూతిని చెడగొట్టకండి అని మూవీ యూనిట్ విజ్ఞప్తి చేసింది.
The World of Toxic is yours from tomorrow. . pic.twitter.com/NPie3oqqi2
— Yash (@TheNameIsYash) August 25, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి
- ●Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ

Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు






