Pak Drones | జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ డ్రోన్లు.. భారత సైన్యం కాల్పులు
జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pakistan) మరోసారి కవ్వింపు చర్యకు పాల్పడింది. కశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో నియంత్రణ రేఖను (LoC) దాటుకుని పాక్ వైపు నుంచి పలు డ్రోన్లు (Pak Drones) భారత్‌లోకి ప్రవేశించాయి.
త్రినేత్ర.న్యూస్: జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pakistan) మరోసారి కవ్వింపు చర్యకు పాల్పడింది. కశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో నియంత్రణ రేఖను (LoC) దాటుకుని పాక్ వైపు నుంచి పలు డ్రోన్లు (Pak Drones) భారత్‌లోకి ప్రవేశించాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు వాటిపై కాల్పులు జరిపారు. సాంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో డ్రోన్‌లు సరిహద్దు దాటుకుని భారత భూభాగంలోకి వచ్చాయి. అవి ఆయుధాలు లేదా మత్తు పదార్థాలు వదిలి ఉండవచ్చన్న అనుమానంతో ఆయా ప్రాంతాలో సైన్యం విస్తృతంగా గాలింపు చేపట్టింది. సుమారు ఐదు డ్రోన్ల కదలికలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

వాటిని మీడియం, లైట్ మెషిన్ గన్స్‌తో వాటిపై కాల్పులు జరిపారు. డ్రోన్ల ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా ఆయుధాలు, మత్తు పదార్థాలు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అప్రమత్తమైన సైన్యం సరిహద్దుల్లో ప్రతి కదలికను గమనిస్తున్నది.

ఆదివారం సాయంత్రం 6.35 గంటల సమయంలో రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో ఉన్న గనియా-కల్సియాలో డ్రోన్ కదలికలను గుర్తించారు. దానిపై కాల్పులు జరిపారు. అదే సమయంలో ఖబ్బర్ గ్రామ సమీపంలో డ్రోన్ వంటి వస్తువు ఎగిరినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు సాయంత్రం 7.15 గంటల సమయంలో సాంబా జిల్లాలోని రామ్‌ఘర్ సెక్కార్‌లో ఉన్న చాక్ బబ్రాల్ గ్రామంపై కొన్ని నిమిషాలపాటు డ్రోన్ ఎగిరినట్లు గుర్తించారు. పూంచ్ జిల్లాలోని మాన్‌కోట్ సెక్టార్‌లో కూడా సుమారు 6.25 గంటల సమయంలో టైన్ నుంచి టోపా వరకు డ్రోన్ కదలికలను సైన్యం గుర్తించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






