త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramachander Rao | దేశంలో అధికార‌ మార్పిడికి కుట్ర : రామ‌చంద‌ర్ రావు

Ramachander Rao | బంగ్లాదేశ్ తరహాలో దేశంలో అరాచకం, హింస సృష్టించి అధికార మార్పిడికి కుట్ర పన్నుతున్న శక్తులకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్ రావు డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Oct 16, 2026, 4.51 pm IST

Ramachander Rao | దేశంలో అధికార‌ మార్పిడికి కుట్ర : రామ‌చంద‌ర్ రావు
Advertisement

బంగ్లాదేశ్ త‌ర‌హాలో దేశంలో అరాచ‌కం
దేశ వ్య‌తిరేక శ‌క్తుల‌తో రాహుల్ చేతులు క‌లిపారు
సీజేపీ దేశ ద్రోహ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ వైఖ‌రి ఏంటి..?
నిల‌దీసిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు

Ramachander Rao | త్రినేత్ర న్యూస్ : బంగ్లాదేశ్ తరహాలో దేశంలో అరాచకం, హింస సృష్టించి అధికార మార్పిడికి కుట్ర పన్నుతున్న శక్తులకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్ రావు డిమాండ్ చేశారు. నాంప‌ల్లిలోని బీజేపీ ఆఫీసులో శుక్ర‌వారం రామ‌చంద‌ర్ రావు మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేకనే రాహుల్ గాంధీ దేశవ్యతిరేక శక్తులతో చేతులు కలిపారు. ఓవైపు రాజ్యాంగ పుస్తకం చేతపట్టుకొని.. మరోదిక్కు రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారు. ప్ర‌శాంత్ భూషణ్, ఐసా (AISA), సీజేపీ నేతల దేశద్రోహ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటి? అని నిల‌దీశారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, కానీ రాహుల్ గాంధీ కేవలం అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన ప్రదర్శనల్లో దేశ వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నప్పటికీ రాహుల్ గాంధీ ఏమాత్రం స్పందించకపోవడం సిగ్గుచేటు. దేశంలో అశాంతి, అలజడి సృష్టించేందుకు అర్బన్ నక్సల్స్ కుట్రలు పన్నుతున్నారని, వారి అజెండాకు కాంగ్రెస్ వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. దేశ సమగ్రతను దెబ్బతీసేలా మాట్లాడే శక్తులపై రాహుల్ ఎందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement